ఢిల్లీలోని షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం…..ఆరుగురు ఉద్యోగుల గల్లంతు…… ఇంకా ముమ్మర సహాయ చర్యలు

ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ షూ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు గల్లంతయ్యారు. పశ్చిమ ఢిల్లీలోని ఉద్యోగనగర్ లో గల ఆపేక్ష ఇంటర్నేషనల్ వేర్ హౌస్ లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఆర్పేందుకు మొదట 24 ఫైరింజన్లను తెప్పించారు.

ఢిల్లీలోని షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం.....ఆరుగురు ఉద్యోగుల గల్లంతు...... ఇంకా ముమ్మర సహాయ చర్యలు
Fire Accident In Shoe Factory In Delhi
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 21, 2021 | 2:55 PM

ఢిల్లీలో సోమవారం ఉదయం ఓ షూ ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు ఉద్యోగులు గల్లంతయ్యారు. పశ్చిమ ఢిల్లీలోని ఉద్యోగనగర్ లో గల ఆపేక్ష ఇంటర్నేషనల్ వేర్ హౌస్ లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఆర్పేందుకు మొదట 24 ఫైరింజన్లను తెప్పించారు. అయినప్పటికీ అవి అదుపులోకి రాకపోవడంతో.. మరో 15 అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు. దట్టమైన పొగలు, మంటలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదానికి సంబందించి తమకు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఆరుగురి ఆచూకీ తెలియడంలేదన్నారు. ఈ ప్రమాదానికి కారణం ఇంకా నిర్ధారణ కాలేదని..బహుశా షార్ట్ సర్క్యూట్ అయి ఉండవచ్చునని భావిస్తున్నామని వారు చెప్పారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది. నగరంలో ఉష్ణోగ్రత పెరిగిపోవడం కూడా స్థానికులకు ఆందోళన కల్గిస్తోంది. అటు- పలు ఫ్లోర్స్ ఉన్న ఈ ఆపేక్ష ఇంటర్నేషనల్ వేర్ హౌస్ లో ఏ అంతస్థు నుంచి మంటలు రేగాయన్నది కూడా తెలియాల్సి ఉంది.

ఇలా ఉండగా నిన్న కూడా ఢిల్లీలోని మంగోలిపురా ప్రాంతంలో సిలిండర్ పేలిన కారణంగా 13 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని ఇక్కడ చూడండి: మూడంతస్తులు ఎక్కొచ్చి బెడ్ పై సీదతీరుతున్న ఎద్దు వైరల్ అవుతున్న వీడియో :Bull king climbed into 3-storey house video viral.

నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్ల‌రి.. అంద‌రూ ఫిదా: viral video.

త్రిభాషా చిత్రంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో..!ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతున్న సినిమా :Shekar kammula and dhanush video

Rajanikanth Video: అమెరికాకు పయనమైన రజనీకాంత్ భార్య తో కలిసి స్పెషల్ ప్లైట్ లో..వైద్య పరీక్షల కోసమేనా ?