AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Exam: ఇంట‌ర్న‌ల్ మార్కులు న‌చ్చ‌ని సీబీఎస్ఈ విద్యార్థుల‌కు పరీక్ష‌లు.. ఆగ‌స్టులో నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డి.

CBSE Exam: క‌రోనా నేప‌థ్యంలో దాదాపు అన్ని విద్యా సంస్థ‌ల‌కు చెందిన బోర్డులు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌లో కేసులు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను సైతం...

CBSE Exam: ఇంట‌ర్న‌ల్ మార్కులు న‌చ్చ‌ని సీబీఎస్ఈ విద్యార్థుల‌కు పరీక్ష‌లు.. ఆగ‌స్టులో నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డి.
TS ECET 2021 Exam
Narender Vaitla
|

Updated on: Jun 21, 2021 | 2:53 PM

Share

CBSE Exam: క‌రోనా నేప‌థ్యంలో దాదాపు అన్ని విద్యా సంస్థ‌ల‌కు చెందిన బోర్డులు ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దేశంలో క‌రోనా సెకండ్ వేవ్‌లో కేసులు విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో సీబీఎస్ఈ 12వ త‌ర‌గతి ప‌రీక్ష‌ల‌ను సైతం ర‌ద్దు చేశారు. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ప్ర‌భుత్వం ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇక ఫ‌లితాలను నిర్దేశిత ప్ర‌మాణాలు, విద్యార్థుల ప్ర‌తిభ ఆధారంగా వెల్ల‌డిస్తామ‌ని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. ఇక ఫ‌లితాలను విడుద‌ల చేయ‌డానికి బోర్డు ప్ర‌క్రియ మొద‌లు పెట్టింది. జూలై 1 నాటికి ఫ‌లితాలను విడుద‌ల చేస్తామ‌ని బోర్డు ప్ర‌క‌టించింది. అయితే ఇంటర్న‌ల్ మార్కుల ఆధారంగా ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తే కొందరు విద్యార్థుల‌కు న‌ష్టం జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌న్న నేప‌థ్యంలో సీబీఎస్ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇంట‌ర్న‌ల్ మార్కులతో ఉత్తీర్ణ‌త విధానాన్ని ఇష్ట‌ప‌డ‌ని వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు బోర్డు ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 15 నుంచి సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు విద్యార్థుల‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు బోర్డు సుప్రీంకు నేడు (సోమ‌వారం) నివేదించింది. ఇంట‌ర్న‌ల్ మార్కులతో సంతృప్తి చెంద‌ని విద్యార్థులలు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ప‌రీక్ష‌ల ఫ‌లితాల ప్ర‌క్రియ కోసం పాఠ‌శాల ప్రిన్సిపాల్ అధ్యక్ష‌తన ఐదుగురితో కూడిన క‌మిటీ వేయాల‌ని బోర్డు సూచించింది. జూలై 31న ఫ‌లితాల‌ను వెల్ల‌డించనున్నారు.

Also Read: Visakhapatnam – Vijayawada route: రైల్వే లైనులో ఆధునీకరణ పనుల కారణంగా విశాఖపట్నం వెళ్ళే రైళ్ళ రద్దు..వివరాలు ఇవే..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. జూలై1 నుంచి పెరగనున్న వేతనాల

Shocking Video: లైవ్ షోలో మనుషులపై తోడేళ్ల దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

Shocking Video: లైవ్ షోలో మనుషులపై తోడేళ్ల దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!