AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam – Vijayawada route: రైల్వే లైనులో ఆధునీకరణ పనుల కారణంగా విశాఖపట్నం వెళ్ళే రైళ్ళ రద్దు..వివరాలు ఇవే..

Visakhapatnam - Vijayawada route: దక్షిణ మధ్య రైల్వే కి చెందిన విశాఖపట్నం-విజయవాడ సెక్షన్‌లో తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య భద్రతా సంబంధిత ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.

Visakhapatnam - Vijayawada route: రైల్వే లైనులో ఆధునీకరణ పనుల కారణంగా విశాఖపట్నం వెళ్ళే రైళ్ళ రద్దు..వివరాలు ఇవే..
Train
KVD Varma
|

Updated on: Jun 21, 2021 | 2:26 PM

Share

Visakhapatnam – Vijayawada route: దక్షిణ మధ్య రైల్వే కి చెందిన విశాఖపట్నం-విజయవాడ సెక్షన్‌లో తుని-గుల్లిపాడు స్టేషన్ల మధ్య భద్రతా సంబంధిత ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా విశాఖపట్నం నుంచి విజయవాడ, గుంటూరు, లింగంపల్లి, కడపాలకు వెళ్లే కొన్ని రైళ్లను రైల్వే రద్దు చేసింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటనలో పేర్కొన్న ప్రకారం ఈ రూటులో పూర్తిగా రద్దయిన రైళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి.

రైలు నం. 02717 విశాఖపట్నం-విజయవాడ స్పెషల్, 02718 విజయవాడ-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు జూన్ 28, 29, జూలై 5, 6 తేదీల్లో రద్దు చేశారు. ఇక గుంటూరు నుంచి బయలు దేరే రైలు నం. 07239 గుంటూరు-విశాఖపట్నం స్పెషల్, జూన్ 27, 28 మరియు 29 తేదీలలో మరియు జూలై 4, 5 మరియు 6 తేదీలలో రద్దు అయింది. అదేవిధంగా, విశాఖపట్నం నుంచి బయలు దేరే రైలు నం. 02831 విశాఖపట్నం-లింగంపల్లి స్పెషల్, జూన్ 27, 28, 29, జూలై 4, 5 , 6 తేదీలలోనూ. తిరిగి వచ్చే దిశలో, లింగంపల్లి నుంచి బయలుదేరాల్సిన 02832 లింగంపల్లి-విశాఖపట్నం స్పెషల్, జూన్ 28, 29,30 తేదీలలో జూలై 5, 6 , 7 తేదీల్లోనూ నిలిపివేస్తారు. రైలు నం. 07488 విశాఖపట్నం – కడప స్పెషల్, జూలై 3, 4, 5 మరియు 6 తేదీలలో అలాగే తిరిగి వచ్చే దిశలో, 07487 కడప-విశాఖపట్నం ప్రత్యేక రైలు, జూలై 4, 5, 6 మరియు 7 తేదీల్లోనూ రద్దవుతాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని చెబుతూనే, భద్రతా పనులు తప్పనిసరిగా చేయించాల్సిన పరిస్థితి దృష్ట్యా ప్రయాణీకులు సహకరించాలని కోరింది. ఇదిలా ఉండగా కోవిడ్ – 19 దృష్టిలో పెట్టుకుని, పూరీ రథ యాత్ర రద్దీని నివారించడం కోసం కొన్ని రైళ్ళు ఖుర్దా రోడ్డు వద్ద నిలిపివేస్తున్నట్టు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె. త్రిపాఠి తెలిపారు. ఆ రైళ్ళ వివరాలు ఇవీ..

పూరీ నుంచి బయలు దేరాల్సిన 08401 పూరి-ఓఖా ప్రత్యేక రైలు, జూన్ 27 నుండి జూలై 18 వరకు పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి బయలుదేరుతుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలోనూ 08402 ఓఖా- పూరి ప్రత్యేక రైలు జూన్ 23 నుండి జూలై 21 వరకు ఓఖా నుండి బయలుదేరుతుంది కానీ, పూరీ కి బదులుగా ఖుర్దా రోడ్ వద్ద నిలిపివేస్తారు.

పూరీ నుంచి బయలు దేరాల్సిన రైలు నం. 02843 పూరి-అహ్మదాబాద్ ప్రత్యేక రైలు, జూన్ 24 నుండి జూలై 23 వరకు మంగళవారం, గురువారం, శుక్రవారం మరియు శనివారం పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి బయలు దేరుతుంది. అదేవిధంగా 02844 అహ్మదాబాద్-పూరి ప్రత్యేక రైలు, జూన్ 24 నుండి జూలై 19 వరకు సోమవారం, గురువారం, శనివారం మరియు ఆదివారం ఖుర్దా రోడ్డు వద్ద నిలిపివేయబడుతుంది. రైలు నం. 02063 పూరి-యశ్వంత్‌పూర్ ప్రత్యేక రైలు, జూన్ 25 నుండి జూలై 23 వరకు పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి ప్రారంభమవుతుంది. 02064 యశ్వంత్‌పూర్-పూరి స్పెషల్, జూన్ 26 నుండి జూలై 17 వరకు ఖుర్దా రోడ్ వద్ద ఆగిపోతుంది. అదేవిధంగా, రైలు నెం. 02859 పూరి- చెన్నై సెంట్రల్ స్పెషల్ రైలు జూన్ 27 న పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి బయలు దేరుతుంది. 02860 చెన్నై సెంట్రల్- పూరి ప్రత్యేక రైలు జూన్ 28 న చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరి ఖుర్దా రోడ్ వద్ద ఆగిపోతుంది. రైలు నం. 02973 గాంధీధామ్ – పూరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, జూన్ 23 నుండి జూలై 21 వరకు బుధవారాల్లో గాంధీధామ్ నుండి బయలుదేరుతుంది. ఖుర్దా రోడ్‌లో నిలిచి పోతుంది. 02974 పూరి-గాంధీధామ్ ప్రత్యేక రైలు జూన్ 26 నుండి జూలై 17 వరకు పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి ప్రారంభమవుతుంది.

రైలు నెం .07479 పూరి-తిరుపతి ప్రత్యేక రైలు, సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం మరియు శనివారం అదేవిధంగా జూన్ 23 నుండి జూలై 21 వరకు పూరీకి బదులుగా ఖుర్దా రోడ్ నుండి బయలు దేరుతుంది. తిరుగు దిశలో, 07480 తిరుపతి- పూరి, సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మరియు ఆదివారం, జూన్ 24 నుండి జూలై 23 వరకు తిరుపతి నుండి బయలుదేరి ఖుర్దా రోడ్ వద్ద ఆగిపోతుంది. ప్రయాణీకులు ఈ మార్పులను గమనించాలని ఆయన కోరారు.

Also Read: Income Tax Returns: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌ లో 40 లోపాలు..ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు చేసిన డీటీపీఏ

Gas Cylinder: మన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను ఇంటి నుంచే మార్చుకునే అవకాశం.. ఎలా.. ఎప్పటినుంచి.. తెలుసుకోండి!

రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO