AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Cylinder: మన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను ఇంటి నుంచే మార్చుకునే అవకాశం.. ఎలా.. ఎప్పటినుంచి.. తెలుసుకోండి!

Gas Cylinder : ఇళ్లలో ఎల్‌పిజి వాడే ప్రజలకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ఇవ్వబోతోంది. ఇప్పుడు ఎల్‌పిజిని ఉపయోగించే కస్టమర్‌లు ఏ డిస్ట్రిబ్యూటర్ నుండి గ్యాస్ రీఫిల్ పొందాలో తమకు తామే నిర్ణయించుకోవచ్చు.

Gas Cylinder: మన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను ఇంటి నుంచే మార్చుకునే అవకాశం.. ఎలా.. ఎప్పటినుంచి.. తెలుసుకోండి!
Refill Booking Portability
KVD Varma
|

Updated on: Jun 21, 2021 | 1:01 PM

Share

Gas Cylinder: ఇళ్లలో ఎల్‌పిజి వాడే ప్రజలకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ఇవ్వబోతోంది. ఇప్పుడు ఎల్‌పిజిని ఉపయోగించే కస్టమర్‌లు ఏ డిస్ట్రిబ్యూటర్ నుండి గ్యాస్ రీఫిల్ పొందాలో తమకు తామే నిర్ణయించుకోవచ్చు. అంటే, వారు తమకు నచ్చిన గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ను ఎన్నుకునే ఎంపిక వారికి దొరుకుతుంది. ఈ సదుపాయానికి ‘రీఫిల్ బుకింగ్ పోర్టబిలిటీ’ అని పేరు పెట్టారు. వచ్చే వారం నుండి దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించేందుకు సన్నహాలు చేస్తున్నారు. అసలు ఈ ‘రీఫిల్ బుకింగ్ పోర్టబిలిటీ’ అంటే ఏమిటి? దానివలన వినియోగదారులకు కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయి? ఇంటి నుంచే ఆన్ లైన్ ద్వారా మన గ్యాస్ డిస్ట్రిబ్యుటర్ ను ఎలా మార్చుకోవచ్చు అనే వివరాలు పరిశీలిద్దాం.

ప్రస్తుతం, మనం గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకుంటే, మనం కనెక్షన్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ మనకు సిలిండర్‌ను బట్వాడా చేస్తారు. అంటే, మన డిస్ట్రిబ్యూటర్ నుండి గ్యాస్ కనెక్షన్ తీసుకున్న తర్వాత, గ్యాస్ కు సంబంధించిన అన్ని సౌకర్యాలను ఒకే డిస్ట్రిబ్యూటర్ మనకు ఇస్తారు. పంపిణీదారుని మార్చడానికి మనకు అవకాశం లేదు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న ఈ ”రీఫిల్ బుకింగ్ పోర్టబిలిటీ’ పథకం అమలు జరిగితే, మనం కొత్త సిలిండర్‌ను బుక్ చేసినప్పుడు, పంపిణీదారుని ఎన్నుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఆన్ లైన్ లో సిలెండర్ బుక్ చేసుకునే సమయంలో మన ప్రాంతంలోని అందరు పంపిణీదారుల జాబితాను అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ లిస్టులోని పంపినీదారుల పూర్తి వివరాలు రేటింగ్ తో సహా అక్కడ డిస్ప్లే అవుతాయి. వీటిని పరిశీలించి మనకు నచ్చిన పంపిణీదారుని మనం ఎన్నుకునే అవకాశం కలుగుతుంది. అప్పుడు మనం ఎంచుకున్న పంపిణీదారుని నుంచి మనకు గ్యాస్ సిలెండర్ బట్వాడా జరుగుతుంది.

పంపిణీదారు రేటింగ్ అంటే..

మనం గూగుల్‌లో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు లేదా శోధించినప్పుడు, మనకు స్టార్ రేటింగ్ కనిపిస్తుంది. ఈ రేటింగ్ ఆ ఉత్పత్తి లేదా సేవ ఎంత మంచిదో చెబుతుంది. 5 స్టార్ రేటింగ్ అంటే ఉత్తమమైనది. అలాగే, 1 స్టార్ అంటే చెత్త అని అర్థం. ఈ విషయం దాదాపుగా అందరికీ తెలిసిందే. అదేవిధంగా, గ్యాస్ పంపిణీదారునికి కూడా రేటింగ్ ఇస్తారు. ఆ పంపిణీదారుని వద్ద దొరికే సౌకర్యాలు..గ్యాస్ పంపిణీ విషయంలో ఆ పంపిణీదారుని రికార్డ్.. ఎంత వేగంగా గ్యాస్ వినియోగదారునికి బట్వాడా చేస్తాడు అనే విధానాలను బట్టి ఈ రేటింగ్ ఇస్తారు. మనం సిలిండర్‌ను బుక్ చేసినప్పుడు, ప్రతి పంపిణీదారు రేటింగ్‌ను కూడా తెలుసుకోగలుగుతాం. దాంతో మనం మన గ్యాస్ కోసం ఉత్తమ పంపిణీదారుని ఎన్నుకోగలుగుతాం.

పంపిణీదారుని ఎన్నుకునే పూర్తి ప్రక్రియ ఇలా..

  • www.mylpg.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు మీ ఎల్‌పిజి ఐడితో లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయిన తరువాత, మీరు ఇప్పటికే నమోదు కాకపోతే మీరు నమోదు చేసుకోవాలి.
  • ఇక్కడ మీరు మీ ప్రాంతానికి అనుగుణంగా పంపిణీదారుల సమాచారాన్ని పొందుతారు.
  • ప్రతి పంపిణీదారుడి పక్కన రేటింగ్ కూడా ఇవ్వబడుతుంది. మీకు నచ్చిన పంపిణీదారుని మీరు ఎన్నుకోవచ్చు.
  • పంపిణీదారుని ఎంచుకున్న తరువాత, మెయిల్ ద్వారా ధృవీకరణ కోసం ఒక ఫారం మీకు వస్తుంది.
  • మీరు పంపిణీదారుని మారుస్తున్నారు అనే సమాచారం మీ ప్రస్తుత పంపిణీదారుకు వెళుతుంది.
  • ప్రస్తుత పంపిణీదారు 3 రోజుల్లోపు ఫోన్ ద్వారా పంపిణీదారుని మార్చవద్దని మిమ్మల్ని అభ్యర్థించవచ్చు.
  • మీరు ఇప్పటికే ఉన్న పంపిణీదారుడితో కొనసాగాలని కోరుకుంటే, పంపిణీదారుడు మీ అభ్యర్థనను రద్దు చేసే అవకాశం ఉంటుంది.
  • మీరు ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటర్‌ను మార్చాలనుకుంటే, మీరు దీని కోసం ప్రస్తుత డిస్ట్రిబ్యూటర్‌ను ఫోన్‌లో కాల్ చేయవచ్చు. అతను వెంటనే మీ కనెక్షన్‌ను కొత్త పంపిణీదారునికి బదిలీ చేస్తాడు.
  • ఇప్పటికే ఉన్న పంపిణీదారు మీ కనెక్షన్‌ను 3 రోజుల్లో బదిలీ చేయకపోతే, నాల్గవ రోజు ఆటోమేటిక్ గా మీ కనెక్షన్ కొత్త పంపిణీదారుకు బదిలీ చేయబడుతుంది.
  • మీరు మీ సిలిండర్ మరియు ఇతర వస్తువులను జమ చేయవలసిన అవసరం లేదు. అలాగే, మీరు పంపిణీదారుడి వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది.
  • ఈ మొత్తం ప్రక్రియ కోసం మీకు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ లేదా ఎలాంటి ఛార్జీ చెల్లించవలసిన అవసరం లేదు.

మొత్తం దేశ ప్రజలకు ప్రయోజనం లభిస్తుందా?

లేదు.. ప్రస్తుతం, ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం దేశంలోని 5 నగరాలను ఎంపిక చేసింది, ఇక్కడ ఈ పథకం ప్రారంభమవుతుంది. వీటిలో చండీగడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీ ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఈ పథకాన్ని క్రమంగా ఇతర నగరాల్లో కూడా ప్రారంభించవచ్చు.

పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఈ పథకాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. రాంచీలోని ఒక డిస్ట్రిబ్యూటర్ చెబుతున్న ప్రకారం, వచ్చే వారం నుండి ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో సిలిండర్లను బుక్ చేసే పద్ధతి కూడా మారుతుందా?

లేదు.. పంపిణీదారుని ఎన్నుకోవడం మినహా సిలిండర్ బుక్ చేసే మొత్తం ప్రక్రియలో ఎటువంటి మార్పు ఉండదు.

Also Read: SBI Customer Center : ఎస్బీఐ కస్టమర్ కేంద్రాన్ని ఎలా ప్రారంభించాలి..! ఎంత ఆదాయం ఉంటుంది.. తెలుసుకోండి..

These Bank ATMs : ఈ బ్యాంకు ఏటీఎంలలో ఎన్నిసార్లయినా డబ్బులు విత్ డ్రా చేయొచ్చు..! పరిమితి లేదు.. ఫైన్ అసలే ఉండదు..