కొత్తమీర- పుదీనా పచ్చడితో అనారోగ్య సమస్యలకు చెక్.. ఆరోగ్యాన్ని అందించే పచ్చడిని ఎలా తయారు చేయాలంటే..

ప్రస్తుతం కేవలం కరోనా నుంచి మాత్రమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను నియంత్రించడం కూడా ముఖ్యమే. ఇందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే అసలైన మార్గం.

కొత్తమీర- పుదీనా పచ్చడితో అనారోగ్య సమస్యలకు చెక్.. ఆరోగ్యాన్ని అందించే పచ్చడిని ఎలా తయారు చేయాలంటే..
Coriander Mint Chutney
Rajitha Chanti

|

Jun 21, 2021 | 12:49 PM

ప్రస్తుతం కేవలం కరోనా నుంచి మాత్రమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను నియంత్రించడం కూడా ముఖ్యమే. ఇందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే అసలైన మార్గం. అయితే ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కేవలం తాజా పండ్లు.. సప్లిమెంట్స్ మాత్రమే కాదు.. పురాతన భారతీయ సంప్రదాయంలో చేసే వంటకాలు కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందులో రోటి పచ్చళ్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొత్తమీ- పుదీనాతో చేసే పచ్చడితో ఆరోగ్యానికి ఎన్నో ప్రయజనాలున్నాయి. మరి అది ఎలా చేయాలి.. ఉపయోగాలెంటో తెలుసుకుందామా.

తయారీ విధానం.. కావల్సినవి.. కొత్తిమీర. పుదీనా.. అల్లం. వెల్లుల్లి. నల్ల ఉప్ప.. జీలకర్ర. నిమ్మకాయ. పచ్చిమిర్చి. తయారీ విధానం.. ముందుగా కొత్తిమీర.. పుదీనా శుభ్రం చేసి అందులోనే కాస్త నల్ల ఉప్పు.. పచ్చిమిర్చి.. అల్లం… వెల్లుల్లి వేసి రోటిలో పేస్ట్ గా చేసుకోవాలి. ఆ తర్వాత మరో బాణలిలో నూనె.. వేసి పోపు పెట్టి.. అందులో ఈ కొత్తిమీర పేస్ట్ వేసి కలపాలి.

ప్రయోజనాలు.. ఈ పచ్చడి.. ఐరన్ లోపాన్ని నియంత్రిస్తుంది. అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది. అలాగే రక్తం తక్కువగా ఉండే వారికి ఈ పచ్చడి మంచిది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. డయాబెటిస్ సమస్యను నియంత్రిస్తుంది. కొత్తిమీరలో ఇన్సులిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా.. మధుమేహం అదుపులో ఉంటుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మంటను తగ్గించడంలో సహయపడుతుంది. నోటి పూతలను కూడా తగ్గిస్తుంది.

Also Read: Bandi Sanjay : ఈటలకు బండి సంజయ్ ఘన స్వాగతం.. ముఖ్యమంత్రి అందుకే మళ్లీ ప్రజల వద్దకు తిరుగుతున్నారని వ్యాఖ్య

Omega -3: ఈ ఐదు రకాల ఫుడ్‌లో ఒమేగా-3 అధికం.. రోగ నిరోధక శక్తి పెంపొందించేందుకు కీలక పాత్ర..!

త్రిభాషా చిత్రంగా శేఖర్ కమ్ముల ధనుష్ కాంబో..!ఊహకందని కంపోజిషన్స్‌లో కొత్తగా కనిపించబోతున్న సినిమా :Shekar kammula and dhanush video

Doctors suicide : శామీర్ పేట్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు డాక్టర్లు.. మృతదేహాల కోసం గాలింపు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu