Doctors suicide : శామీర్ పేట్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు డాక్టర్లు.. మృతదేహాల కోసం గాలింపు
హైదరాబాద్ శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానిక శామీర్ పెట్ చెరువులో దూకి ఇద్దరు డాక్టర్లు ఆత్మహత్యకు ఒడిగట్టారు...
Shamirpet Lake : హైదరాబాద్ శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. స్థానిక శామీర్ పెట్ చెరువులో దూకి ఇద్దరు డాక్టర్లు ఆత్మహత్యకు ఒడిగట్టారు. మృతుల్లో ఒకరు అల్వాల్ EXCELఆస్పత్రిలో హోమియోపతి వైద్యుడు నందన్. చెరువు గట్టు దగ్గర సెల్ ఫోన్, మాస్క్ లు తీసి ఇద్దరు వైద్యులు చెరువులో దూకినట్టు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాల కోసం చెరువులో గజ ఈతగాళ్లతో గాలింపు నిర్వహిస్తున్నారు పోలీసులు. అయితే, వీరు ఎందుకు చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించారన్న దానిపై కేసు నమోదు చేసుకుని విచరణ చేస్తున్నారు పోలీసులు.
తాడేపల్లి గ్యాంగ్ రేప్ ఘటనలో కీలక ఆధారాలు.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో వేట :
ఇదిలా ఉండగా, ఏపీలోని రాజధాని ప్రాంతం తాడేపల్లి గ్యాంగ్‌రేప్ ఘటనను ఏపీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితుల కోసం గుంటూరు జిల్లా పోలీసులు వేటను ముమ్మరం చేశారు. మూడు ప్రత్యేక బృందాలతో మృగాళ్ల కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు సెల్‌ఫోన్, బంగారం వస్తువులు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. ఘటనాస్థలం నుంచి ఇవాళ మరిన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు.
తాడేపల్లి పరిధిలోని సీతానగరం పుష్కరఘాట్ వద్ద కృష్ణా నదిలో ప్రేమజంటపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులు విచారిస్తున్నారు. నిందితుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల పోలీసులు జల్లెడపడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువభాగాన మహానాడు సమీపంలోని రైల్వే వంతెన కింద నిందితులు యువతిపై అత్యాచారానికి పాల్పడి.. నాటుపడవపై విజయవాడవైపు వెళ్లినట్లు యువతి కాబోయేభర్త తెలిపారు. అప్పటికే చీకటి పడిపోవడంతో నిందితులను గుర్తించడం వారికి కష్టమైందని పోలీసులతో చెప్పారు.
నికి తాళం వేసి, మహిళా కార్యదర్శిని దిక్కున్నచోట చెప్పుకోమన్న సర్పంచ్ భర్త