AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay : ఈటలకు బండి సంజయ్ ఘన స్వాగతం.. ముఖ్యమంత్రి అందుకే మళ్లీ ప్రజల వద్దకు తిరుగుతున్నారని వ్యాఖ్య

తెలంగాణ నిఖార్సైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మొండి ధైర్యంతో పని చేసే వ్యక్తి ఈటల..

Bandi Sanjay : ఈటలకు బండి సంజయ్ ఘన స్వాగతం..  ముఖ్యమంత్రి అందుకే మళ్లీ ప్రజల వద్దకు తిరుగుతున్నారని వ్యాఖ్య
Bandi Sanjay
Venkata Narayana
|

Updated on: Jun 21, 2021 | 12:43 PM

Share

Etela at BJP Party office : తెలంగాణ నిఖార్సైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మొండి ధైర్యంతో పని చేసే వ్యక్తి ఈటల అని బండి ప్రశంసించారు నిజమైన ఉద్యమకారులు టీఆరెస్ పార్టీలో ఉండరు, ఉండలేరన్న ఆయన.. టీఆరెస్ లో ఉండలేని నేతలే బీజేపీలో చేరుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బండి సంజయ్ ఘన స్వాగతం పలికారు. బీజేపీ లో చేరిన తరువాత మొదటిసారి రాష్ట్ర కార్యాలయానికి ఈటల రావడం తో పార్టీ కార్యాలయం లోకి దగ్గరుండి పార్టీ అధ్యక్షుడు బండిసంజయ్ ఆహ్వానించారు.

ఈటల తోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , తుల ఉమ కూడా బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఈటలను బండి సన్మానించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్ , దేశంలో కూడా రెండు సీట్లు కూడా లేని వామపక్ష పార్టీ బీజేపీ గురించి మాట్లాడుతున్నాయంటూ ఈ సందర్బంగా బండి సంజయ్ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ దేశంలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించని పార్టీ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. వాళ్ళు కూడా బీజేపీ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేసిన బండి సంజయ్.. బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మద్దతు ఇచ్చి తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ అంటే భయం పట్టుకుందని.. అందుకే మళ్ళీ ప్రజల వద్దకు సీఎం తిరుగుతున్నారని బండి చెప్పుకొచ్చారు.

Read also : East Godavari : పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, మహిళా కార్యదర్శిని దిక్కున్నచోట చెప్పుకోమన్న సర్పంచ్ భర్త