Professor Jayashankar: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి

ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు.

Professor Jayashankar: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన నివాళి
Cm Kcr
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 21, 2021 | 12:30 PM

Professor Jayashankar Vardhanthi: ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పించారు. తెలంగాణ స్వయం పాలనా స్వాప్నికుడు, స్వరాష్ట్రం కోసం సాగిన ఉద్యమాల్లో భావజాల వ్యాప్తికి తన జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచిపోతారని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలో పెడుతున్నదని, ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణలో సబ్బండ వర్గాలు స్వయం సమృద్ధిని సాధిస్తున్నాయని సీఎం అన్నారు. ఒక్కొక్క రంగాన్ని సరిదిద్దుకుంటూ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో అభివృద్ధిలో తెలంగాణ పోటీపడుతున్నది. నూతన తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే జయశంకర్‌కు నిజమైన నివాళి అని సీఎం తెలిపారు.

Read Also….  East Godavari : పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి, మహిళా కార్యదర్శిని దిక్కున్నచోట చెప్పుకోమన్న సర్పంచ్ భర్త