Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax Returns: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌ లో 40 లోపాలు..ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు చేసిన డీటీపీఏ

Income Tax Returns: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను పోర్టల్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై డైరెక్ట్ టాక్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (డీటీపీఏ) ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేసింది.

Income Tax Returns: కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌ లో 40 లోపాలు..ఆర్ధిక మంత్రికి ఫిర్యాదు చేసిన డీటీపీఏ
It Returns
Follow us
KVD Varma

|

Updated on: Jun 21, 2021 | 1:49 PM

Income Tax Returns: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను పోర్టల్ పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై డైరెక్ట్ టాక్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (డీటీపీఏ) ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డిటిపిఎ ఆదివారం ఒక లేఖను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి రాసింది. ఈ లేఖలో కొత్త పోర్టల్ లో ఐటిఆర్ దాఖలుకు సంబంధించిన 40 సమస్యలను వివరించారు. దీనితో పాటు జూన్ 30 తో ముగియనున్న విశ్వస్ పథకాన్ని రెండు నెలల పొడిగించాలని కూడా డీటీపీఏ అభ్యర్ధించింది. ”దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కారణంగా, డిపార్ట్‌మెంట్ అధికారులు పని చేయలేకపోతున్నారని చెప్పారు. అటువంటి పరిస్థితిలో, టిడిఎస్ / టిసిఎస్ స్టేట్మెంట్ మరియు సంబంధిత పనులను పూర్తి చేయడానికి సమయం ఇవ్వాలి. పన్ను చెల్లింపుదారులు కూడా AY 2020-21కి ఐటిఆర్ దాఖలు చేయలేకపోతున్నారు.” ఆ లేఖలో డైరెక్ట్ టాక్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆర్ధిక మంత్రి దృష్టికి తీసుకువచ్చింది. డీటీపీఏ అధ్యక్షుడు ఎన్‌కె గోయల్ ఈ వివరాలను వెల్లడించారు.

కొత్త పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి, ఫిర్యాదులు వస్తునీ ఉన్నాయి. ఆదాయపు పన్ను విభాగం జూన్ 7 న కొత్త పోర్ట్ ఇ-ఫైలింగ్ 2.0 ను ప్రారంభించిందనే విషయం తెలిసిందే. దీనిద్వారా, పన్ను చెల్లింపుదారులు మునుపటి కంటే తమ పన్ను రిటర్న్స్ (ఐటీ రిటర్న్స్) దాఖలును మరింత తేలికగా చేయగలుగుతారని చెప్పారు. అయితే, పోర్టల్ ను ప్రారంభించిన కొన్ని గంటల తరువాత దీనిలో లోపాలు బయటపడ్డాయి. దీంతో కొత్త పోర్టల్‌కు సంబంధించిన ఫిర్యాదులు రావడం ప్రారంభించాయి. ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోర్టల్ తయారుచేసిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీల్కానీను ఈ లోపాలను పరిష్కరించాలని కోరారు. పోర్టల్‌లో వస్తున్న ఫిర్యాదులకు చింతిస్తున్నామని నందన్ నీల్కాని ఆర్థిక మంత్రికి చెప్పారు. అయితే, దీనికి కొన్ని వారాలు పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిజానికి కరోనా కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ ను ఆన్ లైన్ లో చేయడానికి గడువును కూడా ప్రభుత్వం పెంచింది. అయినప్పటికీ, పోర్టల్ లో ఉన్న లోపాల కారణంగా ఇప్పటికీ చాలా మంది తమ రిటర్న్స్ ను దాఖలు చేయలేకపోయారు.

ఇక పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను వివాదాల్ని తగ్గించడం, ప్రభుత్వానికి సకాలంలో ఆదాయాన్ని సంపాదించడం, అలాగే పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో 2020 మార్చి 17 న ప్రత్యక్ష పన్ను ‘వివాద్ సే విశ్వస్’ పథకాన్ని అమలులోకి వచ్చింది. ఈ విశ్వాస్ పథకం కాల పరిమితి జూన్ 30 తో ముగియనుంది. దీనిని మరో రెండు నెలలు పెంచాలని డైరెక్ట్ టాక్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని ఈ లేఖ ద్వారా కోరింది. వాస్తవానికి ఈ పథకం 2021 మార్చి 31 తో పూర్తయింది. కానీ జూన్ 30 వరకూ ప్రభుత్వం అప్పట్లో పొడిగించింది. దీనిని పోర్టల్ లో చిక్కుల కారణంగా మరో రెండు నెలల పొడిగించాలని కోరుతున్నారు.

Also Read: Dalal Street This Week: స్టాక్ మార్కెట్లపై టీకా పంపిణీ, రుతుపవనాల ప్రభావం.. న్యూస్‌పైనే మధుపరుల ఫోకస్

Gas Cylinder For 10 Rupees : ఈ కంపెనీ బంపర్ ఆఫర్..! 10 రూపాయలకే గ్యాస్ సిలిండర్..? మీరు కూడా అర్హులే..