7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. జూలై1 నుంచి పెరగనున్న వేతనాలు

7th Pay Commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 52 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షలకుపైగా మంది పెన్షనర్లకు కేంద్రం ఈ తీపి కబురు అందించింది..

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. జూలై1 నుంచి పెరగనున్న వేతనాలు
7th Pay Commission
Follow us

|

Updated on: Jun 21, 2021 | 2:21 PM

7th Pay Commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. 52 లక్షల మంది ఉద్యోగులకు, 65 లక్షలకుపైగా మంది పెన్షనర్లకు కేంద్రం ఈ తీపి కబురు అందించింది. 7వ వేత సంఘం కొత్త సిఫారసుల ప్రకారం.. ప్రభుత్వం జూలై 1, 2021 నుంచి డీఏను అందిస్తుంది. గత ఏడాది నుంచి ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉండగా, చివరగా వచ్చే నెల నుంచి డీఏ చెల్లిస్తామని కేంద్ర పార్లమెంట్‌కు తెలిపింది. అందు వల్ల ఈ ఉద్యోగులందరికీ వచ్చే నెల నుంచి పెరుగుతున్న జీతం లభించనుంది. కమిషనర్‌ సిఫారసుల ప్రకారం.. అయితే కేంద్రం జూలై 1 నుంచి 7వ పే కమిషన్‌ డీఏ సిఫారసును అమలు చేయబోతోంది. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు వారి ప్రాథమిక వేతనంలో 17శాతం డీఏ, తాజా11 శాతంతో కలిపి28 శాతానికి చేరుకుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఫిట్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ఫిట్‌మెంట్‌ పెరిగితే బేసిక్‌ పే కూడా పెరుగుతుంది. మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే

సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఫిట్​మెంట్​పై ఆధారపడి ఉంటుంది, ఈ ఫిట్​మెంట్ పెరిగితే.. బేసిక్​ పే కూడా పెరుగుతుంది. ఒక ఉద్యోగి బేసిక్​పే రూ.18,000 అయితే అతని మొత్తం జీతం లెక్కిస్తే నెలకు రూ.2700 పెరుగుతుంది. ఈ పెరుగుదల తర్వాత ఉద్యోగులకు ఏడాదికి రూ.32,400 మొత్తం భత్యం లభిస్తుంది. ఇక పెరుగుతున్న ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర సర్కార్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డీఏ అమలు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, కరోనాతో ఇప్పటివరకు మూడు డీఏలు ఆగిపోయాయి. వాటిని జూలై 1 నుంచి చెల్లిస్తే జీతం పెద్ద మొత్తంలో పెరగనుంది.

డీఏ పెండింగ్​ బకాయిలపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 9న రాజ్యసభలో మాట్లాడారు. కరోనా కారణంగా పెండింగ్‌లో ఉన్న మూడు డీఏ బకాయిలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. వీటి రేట్లు సవరించిన రేట్లకు అనుగుణంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం డీఏను 17 శాతం చొప్పున చెల్లిస్తున్నారు. 2020 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం, 2020 జూలై నుంచి డిసెంబర్ వరకు 3 శాతం, 2021 జనవరి నుంచి జూన్ వరకు 4 శాతం డీఏ పెరుగుదల అమల్లోకి రానుంది. ఫలితంగా 11 శాతం మొత్తం డీఏ పెరగనుంది. దీంతో డీఏ మొత్తం 28 (17 + 4 + 3 +4) శాతానికి చేరుకోనుంది. ఇక, జూలై 1 నుంచి ఉద్యోగుల డీఏతో పాటు ఎంప్లాయిస్​ ప్రావిడెంట్​ఫండ్​కు సహకారం, గ్రాట్యుటీ కూడా పెరుగుతుంది. పెరిగిన ద్రవ్యోల్బణ భత్యంతో పాటు కేంద్ర ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు లభించనున్నాయి. దీని ప్రకారం ప్రొఫెసర్ల మెడికల్‌ క్లెయిమ్‌ల పరిమితిని రూ.5వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. ప్రభుత్వ లేదా సిజిహెచ్‌ఎస్‌ ఆమోదించిన ఆస్పత్రుల్లో చికిత్స కోసం రూ.25 వేల వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి

SBI: ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ప్రతినెలా 10 వేల రూపాయలు పొందవచ్చు.. ఎలాగంటే..!

Samsung galaxy M32: శామ్‌సాంగ్‌ నుంచి గెలక్సీ ఎం32 మొబైల్‌.. భారత్‌లో విడుదల.. అద్భుతమైన ఫీచర్స్‌