Credit Card: మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్‌.. భారీగా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్‌

Credit Card: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల వినియోగం చాలా పెరిగిపోతోంది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ వల్ల డిజిటల్‌ క్యాష్‌ పేమెంట్స్‌ పెరిగింది. ఇళ్లల్లో ఉండి అవసరమైన సరుకులు కొనుగోలు.

Credit Card: మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డు.. అదిరిపోయే బెనిఫిట్స్‌.. భారీగా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్స్‌
Slice Credit Card
Follow us
Subhash Goud

|

Updated on: Jun 21, 2021 | 2:41 PM

Credit Card: ప్రస్తుతం క్రెడిట్‌ కార్డుల వినియోగం చాలా పెరిగిపోతోంది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ వల్ల డిజిటల్‌ క్యాష్‌ పేమెంట్స్‌ పెరిగింది. ఇళ్లల్లో ఉండి అవసరమైన సరుకులు కొనుగోలు చేయడం లాంటి పనుల నుంచి కోసం క్రెడిట్‌ కార్డులు, వ్యాలెట్‌లు ఎక్కువగా వాడుతున్నారు. తొలి రోజుల్లో క్రెడిట్‌ కార్డులు అంటే బ్యాంకులు మాత్రమే ఇచ్చేవి. దీని కోసం పెద్ద ప్రాసెసే ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అంతా సులభంగా జరిగిపోతుంది. కార్డు పార్సిల్‌లో ఇంటికొచ్చేస్తోంది. అలాంటి సర్వీసుల్లో స్లైస్‌ ఒకటి. ఇది మామూలు క్రెడిట్‌ కార్డులకు సమానంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మాత్రం, క్రెడిట్ కార్డు కంటే ఎక్కువ ఫీచర్లతో ఇది కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది.

అయితే ఈ క్రెడిట్‌ కార్డు కావాలంటే… స్లైస్‌ యాప్‌ను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్‌ సూచించిన ప్రకారం అవసరమైన వ్యక్తిగత వివరాలు, పాన్‌ కార్డు లాంటి ఇతర సమాచారం అందివ్వాలి. తర్వాత నిర్దేశిత పేజీలో సెల్ఫీ దిగితే.. మొత్తం మీ పాన్‌ కార్డు వివరాలను బట్టి మీకు క్రెడిట్‌ లిమిట్‌ కేటాయిస్తారు. అలా వచ్చిన లిమిట్‌ అమౌంట్‌తో సాధారణ క్రెడిట్‌ కార్డు తరహాలోనే స్లైస్‌ క్రెడిట్‌ కార్డును వాడుకోవచ్చు. అయితే ఇందులో వచ్చే క్యాష్‌ బ్యాక్‌ మిగలిన కార్డులతో పోలిస్తే వేగంగా వస్తాయని సంస్థ చెబుతోంది.

ప్రస్తుతం స్లైస్‌ కార్డు వినియోగదారులకు అందుబాటులో క్యాష్ బ్యాక్‌, ఆఫర్లు ఉన్నాయి. లింక్డ్‌ఇన్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ (₹800 కంటే ఎక్కువ) ఈ కార్డుతో తీసుకుంటే దానిపై ₹100 క్యాష్ బ్యాక్‌ ఇస్తారు. ఐఆర్‌సీటీసీ యాప్‌లో చేసే ₹500కుపైబడిన కొనుగోళ్లపై ఫ్లాట్‌ ₹75ల ఇన్‌స్టంట్‌ క్యాష్ బ్యాక్‌ ఉంటుంది. ఫోన్‌పేలో స్లైస్‌ కార్డులో చేసే కొనుగోళ్లపై ₹50 క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నారు. అయితే కనీసం ₹400 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లోనూ ₹250 క్యాష్‌ బ్యాక్‌ ఉంది. అయితే ఇది ₹1500 అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకే వర్తిస్తుంది. ఇలా ఈ క్రెడిట్‌ కార్డుపై ఎన్నో ఆఫర్లను అందిస్తున్నారు.

ఇవీ కూడా చదవండి:

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త.. జూలై1 నుంచి పెరగనున్న వేతనాలు

SBI: ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ప్రతినెలా 10 వేల రూపాయలు పొందవచ్చు.. ఎలాగంటే..!

PhonePe: ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.. సరికొత్తగా ఆటో టాప్ అప్ ఫీచర్.. దీని వల్ల ఉపయోగం ఏంటంటే..!

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..