PhonePe: ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.. సరికొత్తగా ఆటో టాప్ అప్ ఫీచర్.. దీని వల్ల ఉపయోగం ఏంటంటే..!

PhonePe: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ ఫామ్‌ ఫోన్‌పే కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. గూగుల్‌పేతో పోటీ పడుతోంది. తాజాగా, ఫోన్​పే ‘వాలెట్ ఆటో టాప్​అప్’..

PhonePe: ఫోన్ పే కస్టమర్లకు శుభవార్త.. సరికొత్తగా ఆటో టాప్ అప్ ఫీచర్.. దీని వల్ల ఉపయోగం ఏంటంటే..!
Phonepe
Follow us
Subhash Goud

|

Updated on: Jun 21, 2021 | 6:17 PM

PhonePe: ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ ప్లాట్‌ ఫామ్‌ ఫోన్‌పే కొత్త ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. గూగుల్‌పేతో పోటీ పడుతోంది. తాజాగా, ఫోన్​పే ‘వాలెట్ ఆటో టాప్​అప్’ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. యూపీఐ విధానాన్ని అనుసరించి ఈ కొత్త ఫీచర్​ను రోలవుట్​చేస్తోంది. ఈ ఫీచర్​ ద్వారా కస్టమర్లు తమ ఫోన్‌పే వాలెట్‌ను సులభంగా రీఛార్జ్​ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఫోన్​పే వాలెట్​లో అమౌంట్​ లేనట్లయితే ఆటోమేటిక్​గా బ్యాలెన్స్​ లోడ్​ అవుతుంది. తద్వారా, ఫోన్‌పే కస్టమర్లు ప్రతిసారీ వారి వాలెట్​ను మాన్యువల్‌గా లోడ్‌ చేసే ఇబ్బందులు తప్పుతాయి. అంతేకాదు ఈ ఆటో టాప్-అప్ ఆప్షన్ వినియోగదారుల సమయాన్ని ఆదా చేస్తుంది. సుదీర్ఘమైన ప్రాసెల్​లేకుండా సులభంగా వాలెట్ లోడ్​ చేస్తుంది.  కాగా, యూపీఐ ఈ-మ్యాన్​​డేట్ సెటప్​ చేసిన తర్వాత, కస్టమర్లు తమ వాలెట్‌ను లోడ్ చేయాలనుకున్న లేదా చెల్లింపులు చేయాలనుకున్న ప్రతిసారీ యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓటిపి కోసం వేచి ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. వాలెట్​బ్యాలెన్స్​ జీరోకు పడిపోయినప్పుడు ఆటోమేటిక్​గా రీఛార్జ్​చేస్తుంది.

టాప్‌-ఆప్‌ను ఎలా ఉపయోగించాలంటే.

ముందుగా టాప్-అప్ ఐకాన్​పై క్లిక్​చేయండి. అప్పుడు, మీరు వాలెట్‌కు జోడించాల్సిన మొత్తం నమోదు చేసి టాప్​టాప్​ ప్రారంభించండి. ఉదాహరణకు మీరు ఆటో టాప్-అప్ వాలెట్​లో రూ .1,000 నుండి 5,000 రూపాయల వరకు లోడ్ చేయాలనుకుంటే.. మీ అమౌంట్​ను ఎంటర్​చేసి ‘టాప్-‘ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్క్రీన్ కింద ఉండే ఆటో టాప్-అప్ వాలెట్ ఆప్షన్​ను అప్ అండ్‌ సెట్ చేసుకోవాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేసి.. మీ బ్యాంక్ ఖాతాను ధృవీకరించాలి. ఆ తరువాత, మీ ఫోన్‌పే వాలెట్ వెంటనే రీఛార్జ్ అయిపోతుంది. ఈ మొత్తాన్ని వివిధ రకాల బిల్లులు చెల్లింపులు, రీచార్జ్‌లకు ఉపయోగించుకోవచ్చు.

కాగా, ఈ-మ్యాన్​డేట్​యూపీఐ ఫీచర్ డిజిటల్​పేమెంట్ సిస్టమ్‌లో ముందుంటుందని ఫోన్‌పే తెలిపింది. ఇది డిజిటల్​పేమెంట్ సిస్టమ్‌ను మరింతగా ప్రోత్సహిస్తుందని, డిజిటల్​పేమెంట్​బిజినెస్‌ రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న ఫోన్‌ పే మరింత మరింత మంది కస్టమర్లను చేర్చుకోగలదని తెలిపింది. అలాగే ఈ ఆటోపేమెంట్​ ఫెయిల్యూర్​అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మిగతా మాన్యువల్​ పేమెంట్లతో పోలిస్తే ఇవి 99.99 శాతం సక్సెస్​ రేటు కలిగి ఉంటాయని తెలిపింది. ఫోన్‌ పే ద్వారా మీ మొబైల్​రీఛార్జ్, కరెంట్​బిల్లు, డిష్​ రీచార్జ్​, ఇన్సూరెన్స్​ రెన్యువల్​ వంటి​ ఇతర చెల్లింపుల సేవలు ఎన్నో ఉన్నాయి. కస్టమర్లకు మరిన్ని సులభమైన సేవలు అందించేందుకు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫోన్‌ పే తెలిపింది.

ఇవీ కూడా చదవండి:

Sonu Sood: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు సోనూసూద్‌ లగ్జరీ కారు గిఫ్ట్‌ ఇచ్చాడా..? ఇందులో నిజమెంత..? స్పందించిన సోనూ

Reliance Jio Recharge Plan: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. 56 రోజుల వ్యాలిడిటీతో అందించే ప్లాన్స్‌ ఇవే..!

Post Office Scheme: పోస్టాఫీస్‌లో మరో అదిరిపోయే స్కీమ్‌.. రోజూ రూ.95 ఇన్వెస్ట్‌ చేస్తే.. రూ.14 లక్షలు పొందవచ్చు

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?