AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు సోనూసూద్‌ లగ్జరీ కారు గిఫ్ట్‌ ఇచ్చాడా..? ఇందులో నిజమెంత..? స్పందించిన సోనూ

Sonu Sood: సోనూసూద్‌.. ఈ పేరు తెలియనివారుండరు. అందరి దృష్టిలో దేవుడై ఉన్నారు. ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు..

Sonu Sood: ఫాదర్స్‌డే రోజు కొడుకుకు సోనూసూద్‌ లగ్జరీ కారు గిఫ్ట్‌ ఇచ్చాడా..? ఇందులో నిజమెంత..? స్పందించిన సోనూ
Sonu Sood
Subhash Goud
|

Updated on: Jun 21, 2021 | 9:53 AM

Share

Sonu Sood: సోనూసూద్‌.. ఈ పేరు తెలియనివారుండరు. అందరి దృష్టిలో దేవుడై ఉన్నారు. ఎంతో మందికి ఆర్థిక సాయం చేసి రియల్‌ హీరో అనిపించుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదల నుంచి లాక్‌డౌన్‌, కరోనా కాలంలో ఇబ్బందులు పడుతున్నవారిని సైతం ఆదుకుంటున్నారు. నిమిషాల్లో ప్రాణవాయువును అందించి ప్రాణదాతగా నిలుస్తున్నారు. కష్టకాలంలో ఉన్నవారికి అండగా ఉంటున్నారు. అయితే గత రెండు రోజుల కిందట రియల్‌ హీరో సోనూసూద్‌ గురించి ఓ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఎందో మందికి ఆర్థికంగా ఆదుకుంటున్న సోనూసూద్‌ ఫాదర్స్‌ డే రోజు తన కొడుకుకు రూ.3 కోట్ల విలువ చేసే లగ్జరీ కారు బహుమతి ఇచ్చారంటూ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. అంతే కాదు ఈ కారులో సోనూ కుటుంబం మొత్తం షికారుకు వెళ్లిదంటంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై సోనూసూద్‌ స్పందించారు. కొడుకుకు లగ్జరీ కారు బహుమతి ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చారు.

ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. అసలు నా కొడుకుకు ఎలాంటి కారు గిఫ్ట్‌ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కారు కేవలం ట్రయల్‌ కోసమే తీసుకొచ్చామే తప్ప దానిని కొనుగోలు చేయలేదని వివరణ ఇచ్చారు. అయినా ఫాదర్స్‌డే రోజు పిల్లలు తండ్రులకు ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలి కానీ.. తానెందుకు కొడుకుకు బహుమతి ఇస్తాను అంటూ ప్రశ్నించారు. అయితే వైరల్‌ అవుతున్న ఈ కారు గిఫ్ట్ వార్తలను చాలా మంది నిజమేనని నమ్మినప్పటికీ తనకు మద్దతుగా మాట్లాడటం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు సోనూసూద్‌. ఇక ఫాదర్స్‌ డే రోజున ఇద్దరి కొడుకులతో కాలక్షేపం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అదే అమూల్యమైన కానుకగా సోనూసూద్‌ అభివర్ణించారు.

ఇవీ కూాడా చదవండి

Puri Jagannadh: మన జీవితం మూడు రోజుల డ్రామా.. దీనికి వివాహం ద్వారా జీవితకాల నరకం ఎందుకు ?.. పూరీ షాకింగ్ కామెంట్స్..

Tamannaah Bhatia : ‘మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతాను..’ షాకింగ్ విష‌యం రివీల్ చేసిన త‌మ‌న్నా