Puri Jagannadh: మన జీవితం మూడు రోజుల డ్రామా.. దీనికి వివాహం ద్వారా జీవితకాల నరకం ఎందుకు ?.. పూరీ షాకింగ్ కామెంట్స్..

Puri Musings: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అటు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించడమే కాదు.. పోడ్ కాస్ట్ రూపంలో తన ఆలోచనలు కూడా తెలియజేస్తున్నారు.

Puri Jagannadh: మన జీవితం మూడు రోజుల డ్రామా.. దీనికి వివాహం ద్వారా జీవితకాల నరకం ఎందుకు ?.. పూరీ షాకింగ్ కామెంట్స్..
Puri Jagannadh
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 21, 2021 | 6:19 AM

Puri Musings: డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అటు సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించడమే కాదు.. పోడ్ కాస్ట్ రూపంలో తన ఆలోచనలు కూడా తెలియజేస్తున్నారు. పూరీ మ్యూజింగ్స్ అనే పేరుతో ప్రతిరోజు వివిధ విషయాలపై స్పంధిస్తూ.. ఆయన తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. అటు పూరీ ఆలోచనలు.. మాటలు.. ప్రతి ఒక్కరికి ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా పూరీ లైఫ్ ఆంథెమ్ అంటూ పోడ్ కాస్ట్ లో జీవిత గమనం గురించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు తమ జీవితాన్ని ఎలా గడపాలి అనే విజ్ఞానాన్ని పంచారు.

అలాగే ఈ మాస్ డైరెక్టర్ మరోసారి వివాహం పై వ్యతిరేకతను ప్రదర్శించారు. “మన జీవితం కేవలం మూడు రోజుల డ్రామా. అప్పుడు వివాహం ద్వారా మీకు జీవితకాల నరకం ఎందుకు అవసరం ? ” అని ప్రశ్నించారు. అలాగే అరవై వచ్చాయని విరమించకూడదని.. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. క్లైమాక్స్ బాగుంటే అది సూపర్ హిట్ అవుతుంది. అలాగే మీ జీవితాన్ని కూడా బ్లాక్ బస్టర్ గా మలుచుకోండి.. ఇది తత్వశాస్త్రం కాదు… కనీస ఇంగితజ్ఞానం అని అన్నారు పూరీ. ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్ గా చేస్తుంది. అలాగే కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చివరి షూటింగ్ షెడ్యూల్ జరుపుకుంటుంది లైగర్. ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Puri Musings Video..

Also Read: Wedding: ఎడ్ల బండ్లపై పెళ్లి ఊరేగింపు.. డీజే లేకుండా జానపద పాటలు పాడుతూ.. డ్యాన్స్.. వీడియో వైరల్..

Manisha Koirala: హిందీలోకి ‘అల వైకుంఠపురంలో’.. టబు పాత్రలో కనిపించనున్న సీనియర్ టాప్ హీరోయిన్…