Manisha Koirala: హిందీలోకి ‘అల వైకుంఠపురంలో’.. టబు పాత్రలో కనిపించనున్న సీనియర్ టాప్ హీరోయిన్…

ప్రస్తుతం సీని పరిశ్రమలో రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీతోపాటు.. కోలీవుడ్‏లోకి రీమేక్ అవుతుండగా..

Manisha Koirala: హిందీలోకి 'అల వైకుంఠపురంలో'.. టబు పాత్రలో కనిపించనున్న సీనియర్ టాప్ హీరోయిన్...
Manisha Koirala
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 21, 2021 | 5:59 AM

ప్రస్తుతం సీని పరిశ్రమలో రీమేక్ ట్రెండ్ నడుస్తోంది. అందులో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు హిందీతోపాటు.. కోలీవుడ్‏లోకి రీమేక్ అవుతుండగా.. వివిధ భాషల సినిమాలు తెలుగులోకి రీమేక్ అవుతున్నాయి. ఇప్పటికే అర్జున్ రెడ్డి, నాని నటించిన జెర్సీ సినిమాలు హిందీలో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అందుకున్నాయి. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా కూడా రీమేక్ కాబోతుంది. ఈ మూవీకి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈ డైరెక్టర్ స్క్రీప్ట్ పనులు పూర్తి చేసి… నటీనటులను ఎంపిక చేస్తున్నాడట.

ఇదిలా ఉంటే… హిందీలో రీమేక్ కానున్న అల వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే పాత్రలకు బాలీవుడ్ యంగ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ సెలక్ట్ చేసారు. ఇక తెలుగులో టబు పోషించిన తల్లి పాత్రలో సీనియర్ హీరోయిన్ మనీషా కొయిరాల నటించనుందట. ఇప్పటికే మేకర్స్.. ఆమెతో చర్చలు జరపగా.. మనీషా కూడా అందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ముందుగా తల్లి పాత్ర కోసం టబునే సంప్రదించగా.. ఆమెకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్ మనీషా కొయిరాలకు వచ్చిందట. త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా కోసం ఇతర నటీనటుల ఎంపిక జరుగుతున్నట్లు సమాచారం. ఇక అటు హిందీ రీమేక్ వెర్షన్ కు అల్లు అరవింద్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా తెలుస్తోంది.

Also Read: CJI NV Ramana: తల్లితండ్రుల వలె ఆదరించారు.. తెలుగు రాష్ట్రాల పర్యటనపై భావోద్వేగానికి గురైన జస్టిస్ ఎన్‌వి రమణ

Viral Video: వర్షం పడుతుండగా కూతురి ఆన్ లైన్ క్లాసుల కోసం గొడుగు పట్టుకుని నిలబడిన తండ్రి.. ( వీడియో )

Tamannaah Bhatia : ‘మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతాను..’ షాకింగ్ విష‌యం రివీల్ చేసిన త‌మ‌న్నా

Nawazuddin Siddiqui: లాక్ డౌన్ సమయంలో పొలం బాటపట్టిన బాలీవుడ్ నటుడు.. పంట పండేవరకూ ఇక్కడే అంటూ..