Akhanda Movie: బాలయ్య- బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్.. వినాయక చవితి కానుకగా ‘అఖండ’ ?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెటేస్ట్ సినిమా 'అఖండ'.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెటేస్ట్ సినిమా ‘అఖండ’.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక బాలయ్య.. బోయపాటి కాంబోలో రాబోతున్న మూడవ చిత్రం అఖండ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాలకృష్ణ అభిమానులకు అంచనాలకు తగ్గట్టుగా ఈ మూవీని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నాడు మాస్ డైరెక్టర్ బోయపాటి. అయితే ఈ సమయానికి అఖండ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. మే 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు కూడా. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ఈ మూవీ షూటింగ్ నిలిచిపోవడంతో.. రిలీజ్ వాయిదా పడింది.
ఇప్పడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని తొలగించింది. అటు ఏపీలోనూ కోవిడ్ సెకండ్ కేసులు తగ్గుతుండంతో త్వరలోనే అక్కడ కూడా లాక్ డౌన్ ఎత్తివేసే ఛాన్స్ ఉంది. దీంతో థియేటర్లు 50 శాతం ఆక్యూపెన్సీతో ఓపెన్ కానున్నాయి. ఈ క్రమంలోనే మూవీ షూటింగ్స్ కూడా తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఇందులో భాగంగా.. బాలయ్య – బోయపాటి సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి.. వినాయక చతుర్థి కానుకగా అంటే.. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ లో కనిపించబోతుండగా.. మిర్యాల రవీందర్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Manisha Koirala: హిందీలోకి ‘అల వైకుంఠపురంలో’.. టబు పాత్రలో కనిపించనున్న సీనియర్ టాప్ హీరోయిన్…
Vijay Sethupathi: త్వరలోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ -3’ సిరీస్… కీలక పాత్రలో మక్కల్ సెల్వన్ ?