Petrol Diesel Prices Today: వాహనదారులకు షాకిస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. తాజా ధరల వివరాలు
Petrol Diesel Prices Today: పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు..
Petrol Diesel Prices Today: పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజురోజుకు పైపైకి ఎగబాకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులకు అనుసరిస్తూ ప్రభుత్వరంగ చమురు సంస్థలు (Oil companies) ధరలు పెంచుతూ పోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యల జేబులకు చిల్లు పెడుతోంది. రూ.100 దాటిన పెట్రోల్ ధర మరింత పెరుగుతూ వాహనదాలుకు చుక్కులు చూస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు రవాణ ఖర్చులపై పడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అధికారిక సమాచారం ప్రకారం.. సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ.97.22 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.87.97 ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.98.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.92.58 ఉంది. ఇక కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.97,12 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.82 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.36 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.95.44 ఉంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.04కు చేరగా, డీజిల్ ధర రూ.95.89కి చేరింది. ఇక ఏపీలోని విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.99 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.48 గా ఉంది.