Reliance Jio Recharge Plan: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. 56 రోజుల వ్యాలిడిటీతో అందించే ప్లాన్స్‌ ఇవే..!

Reliance Jio Recharge Plan: టెలికాం రంగంలో సత్తా చాటుతున్న రిలయన్స్‌ జియో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త రీచార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది...

Reliance Jio Recharge Plan: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. 56 రోజుల వ్యాలిడిటీతో అందించే ప్లాన్స్‌ ఇవే..!
Reliance Jio
Follow us

|

Updated on: Jun 21, 2021 | 6:22 AM

Reliance Jio Recharge Plan: టెలికాం రంగంలో సత్తా చాటుతున్న రిలయన్స్‌ జియో వినియోగదారులను ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త రీచార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. రోజుకో కొత్త ప్లాన్లను అందబాటులోకి తీసుకువస్తోంది జియో. చాలా మంది రిలయన్స్‌ జియో వాడుతున్నవారే ఉన్నారు. కస్టమర్లను మరింతగా చేర్చుకునేందుకు జియో కొత్త కొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. 56 రోజుల వ్యాలిడిటీతో వివిధ ప్లాన్‌లను అందిస్తోంది జియో. ఈ నేపథ్యంలో 56 రోజుల చెల్లుబాటుతో జియో అందించే తక్కువ ధర ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

Jio రూ.444 ప్లాన్‌:

ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు నిత్యం 2 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులు. అంటే మొత్తం 112 జీబీ వినియోగదారులకు లభిస్తోంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్‌ కాలింగ్తో పాటు ప్రతి రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. ప్రతి రోజు డేటా లిమిట్‌ అయిపోయిన తర్వాత 64Kbps కు తగ్గుతుంది. దీంతో పాటు, జియో అనువర్తనాలకు ఉచిత సభ్యత్వం కూడా లభిస్తుంది.

జియో రూ.399 ప్లాన్‌:

ఈ ప్లాన్ తో నిత్యం 1.5 జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 56 రోజులు. అంటే.. ఈ ప్లాన్‌లో మొత్తం 84 జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. డైలీ డేటా లిమిట్ అనంతరం వేగం 64Kbps కు తగ్గుతుంది. ఈ ప్రణాళికలో, వినియోగదారులకు అపరిమిత కాలింగ్‌తో రోజుకు 100 SMS ఇవ్వబడుతుంది. జియో యొక్క ఈ ప్రణాళికలో వినియోగదారులకు Jio అనువర్తనాలకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఇయితే రిలయన్స్‌ ఎన్నో రీచార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకంటే మెరుగైన సేవలందిస్తోంది జియో. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రోజురోజుకు మెరుగైన సేవలను అందిస్తూ సులభతరమైన అతి తక్కువ ధరకే రీచార్జ్‌ ప్లాన్స్‌ను కస్టమర్లకు పరిచయం చేస్తోంది. జియో సేవలు మెరుగ్గా ఉండటంతో అధికంగా కస్టమర్లు జియోనే వాడుతుంటారు. ఇతర నెట్‌వర్క్‌లకు పోటీగా జియో టెలికాం రంగంలో దూసుకుపోతోంది.