SBI: ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ప్రతినెలా 10 వేల రూపాయలు పొందవచ్చు.. ఎలాగంటే..!

State Bank Of India: దేశీ అతిపెద్ద బ్యాంకింగ్‌ రంగం అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అదిరిపోయే స్కీమ్‌ అందిస్తోంది. ఇందులో చేరితో ప్రతి నెలా రూ.10 వేల వరకు..

SBI: ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్‌.. ఈ పథకంలో చేరితే ప్రతినెలా 10 వేల రూపాయలు పొందవచ్చు.. ఎలాగంటే..!
Sbi Annuity Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Jun 21, 2021 | 1:40 PM

State Bank Of India: దేశీ అతిపెద్ద బ్యాంకింగ్‌ రంగం అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) అదిరిపోయే స్కీమ్‌ అందిస్తోంది. ఇందులో చేరితో ప్రతి నెలా రూ.10 వేల వరకు పొందవచ్చు. ఈ స్కీమ్‌ పేరు ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్. ఇందులో చేరితే కస్టమర్లకు నిర్దిష్ట కాలం వరకు ప్రతి నెలా డబ్బులు పొందే సదుపాయం ఉంది. ఇప్పటికే రకరకాల స్కీమ్‌లను అందిస్తోంది. డబ్బులు ఇన్వెస్ట్‌ చేస్తే భారీ మొత్తంలో లాభాలు పొందవచ్చు.

ఈ స్కీమ్‌లో నాలుగు రకాల టెన్యూర్లు :

ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో నాలుగు రకాల టెన్యూర్లు అందుబాటులో ఉన్నాయి. 36 నెలలు, 60 నెలలు, 84 నెలలు, 120 నెలల కాలపరిమితితో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇందులో పెట్టుబడిపై వడ్డీ రేటు ఎంచుకున్న పదవీకాలం మొక్క స్థిర డిపాజిట్‌ మాదిరిగానే ఉంటుంది. మీరు 10 సంవత్సరాల పాటు ఫండ్‌ జమ చేస్తే 10 సంవత్సరాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వర్తించే రేటు ప్రకారం వడ్డీ లభిస్తుంది.

ప్రతి నెలా 10 వేల సంపాదన:

మీరు ప్రతినెలా 10 వేల రూపాయల వరకు సంపాదించుకోవాలంటే మీరు రూ.5,07,964 జమ చేయాల్సి ఉంటుంది. మీరు జమ చేసిన మొత్తానికి 7శాతం వడ్డీ రేటు రాబడి లభిస్తుంది. అప్పుడు నెలకు రూ.10వేలు వస్తాయి.

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఎలాంటి నిబంధలు ఉన్నాయి:

ప్రతినెలా 10 వేల రూపాయలను ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ ద్వారా పొందాలంటే గరిష్టపెట్టుబడి పరిమితి లేదు. మీకు కాల పరిమితిని ఎంచుకొని ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పదేళ్ల కాల పరిమితితో డబ్బులు డిపాజిట్ చేస్తే.. అప్పుడు మీకు పదేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీ రేట్లకు వర్తించే వడ్డీ రేటు ప్రకారమే మీకు ప్రతి నెలా డబ్బులు వస్తాయి. ఎఫ్‌డీ రేట్లు ఎలా ఉంటే అలా మీకు యాన్యుటీ స్కీమ్‌పై రాబడి ఉంటుంది. మీరు ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో ఎంత డబ్బులు అయినా డిపాజిట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. మీరు ఈ పథకంలో చేరితే కనీసం రూ.1000 నుంచి పొందవచ్చు. అలాగే సీనియర్ సిటిజన్స్‌కు అదనపు వడ్డీ బెనిఫిట్ కూడా లభిస్తుంది. నామినీని కూడా జత చేసుకోవచ్చు.