Samsung galaxy M32: శామ్‌సాంగ్ నుంచి గెలక్సీ ఎం32 మొబైల్.. భారత్‌లో విడుదల.. అద్భుతమైన ఫీచర్స్
Samsung galaxy M32: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త కొత్త మొబైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు..
Samsung galaxy M32: ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త కొత్త మొబైళ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. తాజాగా శామ్‌సాంగ్‌కు చెందిన ఎం సిరీస్‌లో గెలక్సీ ఎం32 మోడల్‌ను భారత్‌లో సోమవారం విడుదల చేయనుంది. ఈ మొబైల్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. అయితే దీని ధర రూ.15వేల లోపు ఉంటుందని శామ్‌సాంగ్ తెలిపిన విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా అమెజాన్ టీజ్ చేసింది. ఇందులో 90 హెర్ట్జ్ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో అందించనున్నారు.
గతవారం శాంసంగ్ మొబైల్ ప్రెస్ సైట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఇందులో మూడు కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన సపోర్ట్ పేజీ కూడా కంపెనీ అధికారిక వెబ్ సైట్లో కొద్దిరోజుల క్రితం కనిపించింది. గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్‌తో రూ.15 వేల ధరలో మరో పవర్‌ఫుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నామని శాంసంగ్ ప్రెస్‌నోట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. గతేడాది లాంచ్ అయిన గెలాక్సీ ఎం31 రూ.15,999 ధరతో విడుదలైంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-యూ డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో హై బ్రైట్‌నెస్ మోడ్‌ను ఎనేబుల్ చేస్తే.. ఏకంగా 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లభించనుంది. గెలాక్సీ ఎం-సిరీస్‌లో అత్యధిక బ్రైట్‌నెస్ ఉన్న డిస్‌ప్లేను శాంసంగ్ ఈ ఫోన్‌లోనే అందించనుంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ/6 జీబీ ర్యామ్, 64 జీబీ/ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఉండనున్నాయి. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.
ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించనున్నారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించనున్నారు. దీని పొడవు 16 సెంటీమీటర్లుగానూ, వెడల్పు 7.4 సెంటీమీటర్లుగానూ, మందం 0.9 సెంటీమీటర్లుగానూ ఉంది. దీని బరువు 196 గ్రాములుగా ఉండనుంది.