కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం ఉదయం స్పెషల్ ప్లైట్ లో అమెరికా పయనమయ్యారు. గత కొంతకాలంగా రజనీకాంత్ అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు చెన్నై విమానాశ్రయం నుంచి రజనీకాంత్ అమెరికాకి ఆరోగ్య పరీక్షల నిమిత్తమని వెళ్లినట్లు తెలుస్తోంది. కరోనా వలన విదేశాలకు వెళ్ళేందుకు ఆంక్షలు ఉన్నాయి. దీంతో రజనీకాంత్ తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అమెరికా వెళ్ళడానికి అనుమతినివ్వాలని కేంద్రాన్ని కోరారు కేంద్రం రజనీకాంత్ కు అనుమతి ఇవ్వడంతో ఈరోజు ఉదయం తన భార్య తో కలిసి చెన్నై నుంచి స్పెషల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో అమెరికాకు బయలుదేరారు. ఈ స్పెషల్ ఫ్లైట్ లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అమెరికా వెళుతున్నారు. ఇప్పటికే ఆయన అల్లుడు ధనుష్, కూతురు అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే హాలీవుడ్ సినిమా షూటింగ్ నిమిత్తం అల్లుడు ధనుష్ కూతురు ఐశ్యర్య అమెరికాలోనే ఉన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Kajal Aggarwal birthday special video:కాజల్ బర్త్ డే స్పెషల్ వీడియో కాజల్ కెరీర్లోనే గుర్తుండిపోయే పాత్రలెన్నో..