Bihar Elections 2025 Schedule: మరో దంగల్.. బిహార్ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. కౌంటింగ్ ఎప్పుడంటే..?
బీహార్‌లో ఎన్నికల బెల్ మోగింది. నవంబర్ 22లోపు ముందే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.. ఈ మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ తేదీల వివరాలను సోమవారం వెల్లడించింది. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి..

బీహార్‌లో ఎన్నికల బెల్ మోగింది. నవంబర్ 22లోపు ముందే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.. ఈ మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ తేదీల వివరాలను సోమవారం వెల్లడించింది. 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. బిహార్ అసెంబ్లీ 2025 నవంబర్ 22తో ముగుస్తుంది. బిహార్ లో 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.. 14న కౌంటింగ్ జరుగుతుందని సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్..
- రెండు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
- నవంబర్ 6, 11న బిహార్ ఎన్నికలు
- నవంబర్ 14న కౌంటింగ్
ఎస్సీలకు 38, ఎస్టీలకు 2 సీట్లు కేటాయించారు. మొత్తం 90,712 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 100 శాతం వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. 14 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
Bihar Election to take place in two phases on 6th and 11th November. Counting to take place on 14th November. pic.twitter.com/KZCt6dNGRV
— ANI (@ANI) October 6, 2025
ప్రతి పోలింగ్ కేంద్రంలో 1200 ల మందికి మించకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే.. పోలింగ్ బూత్ బయట మొబైల్ ఫోన్ భద్రపరుచుకునేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు.
కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ తర్వాత జరిగే మొదటి రాష్ట్ర ఎన్నికలు ఇవి. ఈ సవరణ 68.5 లక్షల మంది ఓటర్లను తొలగించి, 21.5 లక్షల మంది కొత్తవారిని చేర్చినట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. పకడ్బంధీ ఏర్పాటు చేశామని.. సోషల్ మీడియా పోస్టులపై గట్టి నిఘా పెట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియను మరింత సులభం చేస్తున్నట్లు తెలిపారు.
ఓటర్లు ఎలాంటి ఫిర్యాదులైనా 1950 కు ఫోన్ చేసి చెప్పవచ్చని.. వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 243 అబ్జర్వర్లు నియమించామని.. ఏమైనా ఫిర్యాదులుంటే వారికి కూడా ఇవ్వవచ్చని తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదే..
కాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను కూడా ఎన్నికల సంఘం విడుదల చేసింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఇప్పటినుంచి హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.
తొలిసారిగా బ్యాలెట్‌పై అభ్యర్థుల కలర్ ఫోటోలు..
కాగా.. దేశంలోనే తొలిసారిగా బ్యాలెట్‌పై అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించబోతున్నామని తెలిపారు. అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు 17 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఈ చర్యలు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడమే కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.
కాగా.. బీహార్ లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. జేడీయూ అధినేత నితీష్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (జేడీయూ – బీజేపీ), ఇండి కూటమి (కాంగ్రెస్, ఆర్జేడీ) మధ్య తివ్ర పోటీ ఉండనుంది. ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉండనున్నాయి..




