కాస్త చూసుకోవాలి కదా అడ్వకేట్ సాబ్.. మాయదారి మత్తుకు రూ.2 కోట్లు స్వాహా..
ఇటీవల కాలంలో హనీట్రాప్స్ పెరిగిపోతున్నాయ్. ఈజీ మనీ కోసం అలవాటు పడిన కొందరు యువతులు భాగా డబ్బున్న వారిని పరిచయం చేసుకొని వారికి దగ్గరై.. తర్వాత వారి ప్రైవేట్ ఫోటో, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ముంబైలో వెలుగు చూసింది. 28 ఏళ్ల ఒక యువతీ ఒక న్యాయవాది నుంచి ఏకంగా రూ.2కోట్లు కాజేసినట్టు ఆయన ఆరోపించారు. దీంతో సదురు యువతితో పాటు, ఆమె తల్లిదండ్రులు, సోదరి, స్నేహితుడిపై దోపిడీ, పరువు నష్టం నేరం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఆర్థికరాజధాని ముంబైలో హనీట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక పేరొందిన న్యాయవాదితో పరిచయం పెంచుకొని దగ్గరైన ఒక యువతి అతడి నుంచి ఏకంగా రూ. రెండు కోట్లు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో నిందితురాలిపై పలు సెక్షణ్‌ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరేగావ్ వెస్ట్‌కు చెందిన 51 ఏళ్ల న్యాయవాదికి 2024లో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల మహిళ తన స్నేహితుల ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారు కాంటాక్ట్ వివరాలు, సోషల్ మీడియా ఐడీలను ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరు టచ్‌లో ఉన్నారు.
అయితే జూన్ 2024లో బాధితుడు ఒక కాన్ఫరెన్స్ కోసం జెనీవాలో వెళ్లినప్పుడు సదురు యువతి అతనికి అర్థరాత్రి ఫోన్ చేసి, తన బంధువు అనారోగ్యంగా ఉన్నాడని వెంటనే రూ.50 లక్షలు డబ్బు కావాలని అడిగింది. దీంతో అది నిజమని నమ్మిన బాధితుడు ఆమెకు తన SBI ఖాతా నుండి రూ.2.5 లక్షలు బదిలీ చేశాడు. అలాగే అతను ఇండియాకు తిరిగొచ్చాక పలు రకాలకు ఆమె అతడి నుంచి మరో రూ.2.5లక్షలు తీసుకుంది. తనకు పెళ్లైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పినా ఆ మహిళ తనతో శారీరక సంబంధం కొనసాగించింది బాధితుడు పేర్కొన్నాడు. ఇలా అప్పటి నంచి పలు కారణాలు చెప్పి అతనితో డబ్బులు తీసుకుంటూనే వచ్చింది ఆ యువతి అంతేకాకుండా ఇద్దరూ విదేశాలకు టూర్‌లు కూడా వెళ్లారు అక్కడ కూడా అతనే ఖర్చులు మొత్తం బరించాడు.
అయితే ఇలా ఒకసారి రూ.20లక్షలు ఇవ్వాలని యువతి డిమాండ్ చేయగా అందుకు బాధితుడు నిరాకరించాడు. దీంతో ఆమె డబ్బులు ఇవ్వకపోతే తనపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డావని పోలీసు కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడిందే. ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యులు, ఆమె స్నేహితుడు కూడా బాధితుడిని బెదిరించడం స్టార్ట్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు అక్టోబర్ మూడవ తేదీన పోలీసులను ఆశ్రయించాడు.
సదురు మహిళ తనను మోసం చేసి పలు దఫాలుగా సుమారు రూ.2కోట్లు తీసుకుందని, ఇంకా డబ్బులు ఇవ్వకపోతే తనపై తప్పుడు ఆరోపణల చేసి బెదిరింపులకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశాడు. ఆమెకు ఇచ్చి డబ్బుతో ఎక్కువ భాగం నగదు రూపంలోనే చెల్లించిన ఆయన పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదుతో సదురు మహిళ, ఆమె పేరెంట్స్, సోదరి, స్నేహితుడిపై దోపిడీ, పరువు నష్టం నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




