బ్యాంక్‌ లాకర్‌కు మరమ్మత్తు చేశాడు.. కన్నం వేశాడు.. ! కానీ ఎక్కడ బెడిసికొట్టిందంటే..?

ఢిల్లీలోని ఓ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. సిసి కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా చోరీకి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి 55 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. యూనియన్‌ బాంక్‌...

బ్యాంక్‌ లాకర్‌కు మరమ్మత్తు చేశాడు.. కన్నం వేశాడు.. ! కానీ ఎక్కడ బెడిసికొట్టిందంటే..?
Delhi Union Bank Robbery
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2021 | 3:46 PM

ఢిల్లీలోని ఓ బ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. సిసి కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా చోరీకి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసి 55 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. యూనియన్‌ బాంక్‌ ఆఫ్‌ ఇండియా షాదారా బ్రాంచ్‌కు కన్నం వేసిన ఇద్దరు దుండగులు 55 లక్షల రూపాయలు ఎత్తుకెళ్ళారు. అయితే నిందితుడు ఇంటరాగేషన్‌లో చెప్పిన విషయాలకు బ్యాంక్‌ అధికారులు షాక్‌ తిన్నారు. ఆరు నెలల క్రితం బ్యాంక్‌ స్ట్రాంగ్‌రూమ్‌లో మరమ్మత్తుల కోసం పిలిచిన వ్యక్తే చోరీకి పాల్పడ్డాడన్న విషయం తెలిసి అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. బ్యాంక్‌ను ఆనుకుని నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌ గోడను డ్రిల్‌ చేసి స్ట్రాంగ్‌రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన హరిరామ్‌, అతడికి సహకరించిన కాలిచరణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్యాంక్‌ లాకర్‌ గదిలోకి ఎవరన్నా వెళ్ళారా అన్న కోణంలో పోలీసు బృందాలు పలువురిని ప్రశ్నించాయి. అయితే సిసి కెమెరాను ధ్వంసం చేసే ముందు దుండగుడి మొహం కొంతభాగం రికార్డైంది. ఈ చిన్న క్లూతో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. ఆరు మాసాల కిందట స్ట్రాంగ్‌ రూమ్‌కు మరమ్మత్తులు చేసిన కార్మికుడే నిందితుడని గుర్తించి ప్రశ్నించారు.

 3 నెలలు నుంచి స్కెచ్ వేసి…

నిందితుడు హరిరామ్ బ్యాంకు దగ్గర్లోనే నివాసం ఉంటాడు. భవన నిర్మాణ కూలీగా పని చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం బ్యాంకులో ఆధునికీకరణ పనులు జరిగాయి. ఆ పనులు చేసేందుకు హరిరామ్ వచ్చాడు. బ్యాంకులో డబ్బుపై కన్నేసి.. అప్పుడే  అక్కడి వ్యవస్థలను పూర్తిగా గమనించాడు.  అనంతరం బ్యాంకు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా పలుసార్లు రెక్కీ చేశాడు. క్యాష్ ఉంచే ప్లేస్ చూశాడు. లోనికి ఎలా రావాలి, బయటకు ఎలా వెళ్లాలి అంతా స్కెచ్ గీసుకున్నాడు. బ్యాంకులో చోరీకి మూడు నెలల పాటు వ్యూహరచన చేశాడు. చివరికి అదను చూసి గోడకు రంధ్రం వేసి.. కాలిచరణ్‌ అనే మరో వ్యక్తి సాయంతో బ్యాంకులోకి చొరబడి చోరీ చేశాడు. చోరీ చేసిన డబ్బుని గ్యాంబ్లింగ్ కోసం వాడాలని హరిరామ్ అనుకున్నాడు. కాగా ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే చేధించడం విశేషం.

Also Read: అతడి శరీరం అయస్కాంతంలా మారిపోయింది.. స్టీల్ ప్లేట్లు, ఇనుప వస్తువులు ఇట్టే అతుక్కుపోతున్నాయ్

‘గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?’ నెటిజన్‌ రిక్వెస్ట్‌కు సోనూసూద్‌ క్రేజీ రిప్లై