COVID-19 vaccination: దేశవ్యాప్తంగా జోరందుకున్న వ్యాక్సినేషన్.. 31కోట్లకు చేరువైన టీకా తీసుకున్న వారి సంఖ్య..!

దేశంలో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంది. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి సంఖ్య 31 కోట్లు దాటింది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.

COVID-19 vaccination: దేశవ్యాప్తంగా జోరందుకున్న వ్యాక్సినేషన్.. 31కోట్లకు చేరువైన టీకా తీసుకున్న వారి సంఖ్య..!
Covid Vaccination
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 23, 2021 | 2:38 PM

India’s COVID-19 vaccination record: దేశంలో వ్యాక్సినేషన్‌ వేగం పుంజుకుంది. వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి సంఖ్య 31 కోట్లు దాటింది. వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. అందరికీ వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం.. టీవీ9 నినాదం.. దేశం విధానం. మరి ఇప్పటి వరకు దేశంలో ఎంత మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎంత మంది? దేశంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఫుల్‌ డీటేల్స్ ఇప్పుడు చూద్దాం.

దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 29 కోట్ల 12 లక్షల 72 వేల 058 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. అందులో 23 కోట్ల 98 లక్షల 34 వేల 542 మందికి మొదటి డోస్‌ అందగా.. 5 కోట్ల 14 లక్షల 37 వేల 516 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇవాళ ఇప్పటి వరకు 16 లక్షల 33 వేల 342 మందికి వ్యాక్సినేషన్‌ పూర్తయింది.

Covid Vaccine

Covid Vaccine

తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు జనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 40 లక్షల 65 వేల 409 మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది. కోటి 13 లక్షల 11 వేల 343 మందికి మొదటి డోస్‌ అందగా.. 27 లక్షల 54 వేల 66 మందికి రెండో డోస్‌ కూడా పూర్తైంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 95 లక్షల 24 వేల 861 మందికి వ్యాక్సినేషన్ అందింది. అందులో మొదటి డోస్‌ పూర్తైన వారు 81 లక్షల 12 వేల 461 మంది. రెండో డోస్‌ తీసుకున్న వారు 14 లక్షల 12 వేల 400 మంది.

ఇక, ఏ కంపెనీ వ్యాక్సిన్లు ఎన్ని అందాయనే వివరాలు గమనిస్తే.. 25 కోట్ల 64 లక్షల 32 వేల 306 మందికి covisheild అందితే.. 3 కోట్ల 47 లక్షల 91 వేల 443 మందికి covaxine వ్యాక్సిన్లు అందాయి.

వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నంటున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 31 కోట్లు దాటింది. ఆ వివరాలు చూస్తే.. 31 కోట్ల 81 లక్షల 57 వేల 448 మంది వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో 14 కోట్ల 27 లక్షల 62 వేల 699 మంది.. 18 నుంచి 44 ఏళ్ల మధ్య గ్రూప్ వారు అయితే.. 17 కోట్ల 53 లక్షల 94 వేల 748 మంది 45 ఏళ్ల పై బడిన వారు.

Covid Vaccine

Covid Vaccine

అందరికి వ్యాక్సిన్.. అందరికీ ఆరోగ్యం. టీవీ9 నినాదం.. దేశం విధానం.. కరోనా తీవ్రత తట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందరం కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.. Read Also…. Corona : హైకోర్టు విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నివేదిక సమర్పించిన డీహెచ్ శ్రీ‌నివాసరావు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!