Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona : హైకోర్టు విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నివేదిక సమర్పించిన డీహెచ్ శ్రీ‌నివాసరావు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ నేపథ్యంలో హైకోర్టుకు నివేదిక సమర్పించారు తెలంగాణ రాష్ట్ర‌ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీ‌నివాస్‌రావు...

Corona : హైకోర్టు విచారణ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నివేదిక సమర్పించిన డీహెచ్ శ్రీ‌నివాసరావు
Telangana Public Health Director G Srinivasa Rao
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 23, 2021 | 1:26 PM

Telangana Covid conditions : రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు తెలంగాణ హైకోర్టు విచారణ నేపథ్యంలో హైకోర్టుకు నివేదిక సమర్పించారు తెలంగాణ రాష్ట్ర‌ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీ‌నివాస్‌రావు. రోజుకు సరాసరి 1.17లక్షల కరోనా పరీక్షలు జరుగుతున్నాయని చెప్పిన డీహెచ్.. తెలంగాణ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గిందని వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలపై జీవో జారీ చేశామని, 170 ప్రైవేట్ ఆస్పత్రులపై 350 ఫిర్యాదులు వచ్చాయని వీటిలో 30 ఫిర్యాదులు పరిష్కరించి, రూ.72.20లక్షలు ఇప్పించామని కోర్టుకు విన్నవించారు. మిగతా బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో వ్యాక్సినేషన్ చురుగ్గా కొనసాగుతోందని డీహెచ్ శ్రీనివాస్ రావు కోర్టుకు తెలిపారు. రెండు డోసులు 28.76 లక్షలు, ఒక డోసు 68.48 లక్షల మందికి ఇచ్చామన్నారు. ఇంకా 1.94 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నెల 29 నాటికి కేంద్రం నుంచి 10. 76లక్షల డోసులు రావాల్సి ఉందని, హైరిస్కు గ్రూపుల్లో 23.11 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. విదేశాలకు వెళ్లే 6,874 మంది విద్యార్థులకు వ్యాక్సిన్లు ఇచ్చామని స్పష్టం చేశారు.

మానసిక ఒత్తిడికి చికిత్స, కౌన్సిలింగ్ కోసం అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసినట్టు డీహెచ్ వెల్లడించారు. మూడో దశ కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లోని 27, 141 పడకలకు 10, 224 పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉందని డీహెచ్ కోర్టుకు చెప్పారు.

Read also : Vemula Prashanth Reddy : ‘నా వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజల మీద కాదు.’ పూర్తి స్పష్టతతో లేఖ విడుదల చేసిన తెలంగాణ మంత్రి