Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM YS Jagan – Chiranjeevi: చిరంజీవి ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్

ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

CM YS Jagan - Chiranjeevi: చిరంజీవి ప్రశంసలకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం వైయస్ జగన్
Cm Jagan And Chiranjeevi
Follow us
Venkata Narayana

|

Updated on: Jun 23, 2021 | 6:31 PM

CM Jagan reply to Chiranjeevi : ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ట్విట్టర్లో చిరంజీవి చెప్పిన అభినందనలకు బదులుగా సీఎం జగన్ ట్వీట్ చేశారు. ” చిరంజీవి గారు, రాష్ట్ర ప్రభుత్వం తరపున, మీ ప్రేమ పూర్వక ప్రశంసలకు ధన్యవాదాలు. ఈ క్రెడిట్ అంతా విలేజ్ / వార్డ్ సెక్రటేరియట్స్, వాలంటీర్స్, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, పిహెచ్‌సి వైద్యులు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జెసిలు ఇంకా, కలెక్టర్ల బృందానికి వెళుతుంది” అని సీఎం చిరంజీవికి విన్నవించారు.

ఇలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టి భారీ సంఖ్యలో కరోనా టీకాలు వేయడాన్ని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నిన్న ట్విట్టర్ ముఖంగా అభినందించిన సంగతి తెలిసిందే. ఏపీలో కొవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా చిరు అభినందించారు.

కొవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్‌ చేశారు. గతంలో కూడా జగన్ సర్కారుపై చిరు ప్రశంసలు కురించిన సందర్భాలు ఉన్నాయి.

Jagan Tweet To Chiranjeevi

Jagan Tweet To Chiranjeevi

Read also : Etela : ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్ ఎత్తేసింది.. ‘మమ్మల్ని ఇబ్బంది పెడితే మసే..’ : ఈటల

ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
24 సిక్సర్లతో క్రికెట్ ప్రపంచానికి మెంటలెక్కించిన యంగ్ ప్లేయర్
24 సిక్సర్లతో క్రికెట్ ప్రపంచానికి మెంటలెక్కించిన యంగ్ ప్లేయర్
డీలర్ల వద్దకు చేరుతున్న ఓలా బైక్స్.. త్వరలోనే డెలివరీలు షురూ
డీలర్ల వద్దకు చేరుతున్న ఓలా బైక్స్.. త్వరలోనే డెలివరీలు షురూ
రికార్డు బ్రేక్ చేసిన రియాన్! బ్యాట్‌తో కాదు బాస్.. ఫీల్డింగ్‌తో
రికార్డు బ్రేక్ చేసిన రియాన్! బ్యాట్‌తో కాదు బాస్.. ఫీల్డింగ్‌తో
ఐఫోన్లు అమెరికాలో కాకుండా చైనాలో ఎందుకు తయారవుతాయి?
ఐఫోన్లు అమెరికాలో కాకుండా చైనాలో ఎందుకు తయారవుతాయి?
9 కోట్ల DC పెట్టుబడి కి JFM ప్లాప్ షో!
9 కోట్ల DC పెట్టుబడి కి JFM ప్లాప్ షో!
అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్
అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్
12 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డ్.. బాపట్ల బుడ్డోడి ట్యాలెంట్‌ చూడండి!
12 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డ్.. బాపట్ల బుడ్డోడి ట్యాలెంట్‌ చూడండి!