AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela : ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్ ఎత్తేసింది.. ‘మమ్మల్ని ఇబ్బంది పెడితే మసే..’ : ఈటల

'వందల కోట్లు పెట్టి నాగార్జున సాగర్ లో నీవు గెలవచ్చు.. కానీ ఇక్కడ న్యాయం ధర్మం గెలుస్తుంది' అని చెప్పుకొచ్చారు తెలంగాణ బీజేపీ తాజా నేత ఈటల రాజేందర్...

Etela  : ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్ ఎత్తేసింది..  'మమ్మల్ని ఇబ్బంది పెడితే  మసే..' : ఈటల
Etela Rajendar
Venkata Narayana
|

Updated on: Jun 23, 2021 | 2:05 PM

Share

Etela Rajender on CM KCR : ‘వందల కోట్లు పెట్టి నాగార్జున సాగర్ లో నీవు గెలవచ్చు.. కానీ ఇక్కడ న్యాయం ధర్మం గెలుస్తుంది’ అని చెప్పుకొచ్చారు తెలంగాణ బీజేపీ తాజా నేత ఈటల రాజేందర్. వచ్చే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ఆత్మ గౌరవం గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆరెస్ ఆధిపత్యాన్ని ఓడించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయన్న ఆయన, తెలంగాణ ఆకలిని భరిస్తుంది కానీ, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే భరించదు అని ఆయన అన్నారు. “ప్రభుత్వం అనేది ప్రజల కోసం పని చేయాలి. ఒక ఉద్యమ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్ లను ఎత్తేసింది ఈ ప్రభుత్వం.. హుజురాబాద్ లో చీకటి రాజకీయం జరుగుతుంది.” అని ఈటల ఆరోపించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు కుల సంఘాలతో మాట్లాడుతూ అనేక హామీలు ఇస్తున్నారని పరోక్షంగా సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన ఈటల.. కన్నతల్లి పాలు తాగిన వాళ్ళం.. మనం ధర్మం తప్పవద్దు అంటూ హుజూరాబాద్ ఓటర్లకు చెప్పుకొచ్చారు. కొన్ని ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండాలన్నారు. ‘నేను ప్రజలను, వ్యవస్థను నమ్ముకుంటే.. కేసీఆర్ డబ్బును, కుట్రను నమ్ముకుంటాడు.’ అని ఈటల అన్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇవాళ ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ ఇవాళ పై వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ‘మా వాళ్ళను ఇబ్బంది పెడితే మాడి మసి అయిపోతారు బిడ్డ.. అంటూ కేసీఆర్ సర్కారుకు పరోక్ష హెచ్చరికలు జారీచేశారు ఈటల.

Read also : Vemula Prashanth Reddy : ‘నా వ్యాఖ్యలు ఆంధ్ర ప్రజల మీద కాదు.’ పూర్తి స్పష్టతతో లేఖ విడుదల చేసిన తెలంగాణ మంత్రి