AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అతడి శరీరం అయస్కాంతంలా మారిపోయింది.. స్టీల్ ప్లేట్లు, ఇనుప వస్తువులు ఇట్టే అతుక్కుపోతున్నాయ్

తెలంగాణలో ఒక శరీరం అయస్కాంతంగా మారింది. స్టీల్ వస్తువులు అవలీలగా అతుకుంటున్నాయి. అతడిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇతగాడు.

Telangana: అతడి శరీరం అయస్కాంతంలా మారిపోయింది.. స్టీల్ ప్లేట్లు, ఇనుప వస్తువులు ఇట్టే అతుక్కుపోతున్నాయ్
magnet man
Ram Naramaneni
|

Updated on: Jun 23, 2021 | 3:13 PM

Share

తెలంగాణలో ఒక శరీరం అయస్కాంతంగా మారింది. స్టీల్ వస్తువులు అవలీలగా అతుకుంటున్నాయి. అతడిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇతగాడు ఒంటికి స్టీల్‌ ప్లేట్లు, స్పూన్లు అంటించుకుంటూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు. ఇంతకీ ఇతని శరీరం ఎందుకిలా అయస్కాంత శక్తిగా మారిందనే కదా మీ సందేహం.. అక్కడికే వస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌కు చెందిన అక్రోజు రమేశ్‌ బంగారు నగల దుకాణం నిర్వహిస్తున్నాడు. వారం రోజుల కిందట భోజనం చేస్తుండగా రమేష్‌ కొడుకు సరదాగా ఓ గిన్నెను తెచ్చి ఆయన శరీరంపై ఉంచగా అది అతుక్కుపోయింది. అది చూసిన అవాక్కైన రమేష్‌.. వెంటనే ఇనుము, స్టీలు సామగ్రిని తన శరీరంపై ఉంచి చూసుకోగా కింద పడకుండా అలాగే ఉండిపోయాయి. ఎగిరినా అవి కింద పడటం లేదని చెబుతున్నాడు.

గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అంటున్నారు. అయితే.. ఇటీవల అతడు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఈ వ్యాక్సిన్ తోనే.. ఇలా అత్కుకుంటుందని అతడు అనుమానం వ్యక్తం చేస్తుండగా, వైద్యులు మాత్రం వ్యాక్సిన్ కు సంబంధం లేదని చెబుతున్నారు. గతంలో కూడా కరీంనగర్ లో ఓ అబ్బాయి శరీరానికి స్టీల్ అతుక్కోవడం జరిగినట్లు స్థానికులు గుర్తుచేస్తున్నారు.

మహారాష్ట్రలో కూడా

మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో కూడా ఇలాంటి వింత కేసు వెలుగులోకి వచ్చింది. కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసుకు తీసుకున్న ఓ వ్యక్తి.. వింత ఫిర్యాదు చేశాడు. వ్యాక్సిన్ సెకండ్ డోస్ తీసుకున్న తరువాత తన శరీరంలో అయస్కాంత శక్తి ఉత్పన్నమైందని కంప్లైంట్ ఇచ్చాడు. దీని వల్ల ఇనుము, ఉక్కు పాత్రలు తన శరీరానికి అతుక్కుపోతున్నాయని వాపోయాడు. తన వాదనను నిరూపించడం కోసం బాధిత వ్యక్తి ఒక వీడియోను కూడా తీసి షేర్ చేశాడు. ఈ వీడియోలో ఇంట్లో ఉపయోగించే స్ఫూన్‌లు, చిన్న ప్లేట్స్ సదరు వ్యక్తి శరీరానికి అతుక్కుపోతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Bol Bhidu (@bolbhidu)

Also Read:  ‘గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?’ నెటిజన్‌ రిక్వెస్ట్‌కు సోనూసూద్‌ క్రేజీ రిప్లై

నెమలి లాంటి నాట్యం, కోయిల లాంటి గాత్రం.. ఎన్నో రికార్డులు దాసోహం.. తాజాగా