Sonu Sood: ‘గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?’ నెటిజన్‌ రిక్వెస్ట్‌కు సోనూసూద్‌ క్రేజీ రిప్లై

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతాలకుతులం చేస్తున్న దశలో సినీ నటుడు సోనూసూద్ వేగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తనకు వీలైనంతలో చాలామందిని ఆదుకుంటున్నారు...

Sonu Sood: 'గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?' నెటిజన్‌ రిక్వెస్ట్‌కు సోనూసూద్‌ క్రేజీ రిప్లై
Sonusood
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 22, 2021 | 7:23 PM

కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతాలకుతులం చేస్తున్న దశలో సినీ నటుడు సోనూసూద్ వేగంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. తనకు వీలైనంతలో చాలామందిని ఆదుకుంటున్నారు. కరోనా ఫస్ట్‌ వేవ్ నుంచి ఎవరికి సాయం కావాలన్నా సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించి వారికి చేదోడుగా నిలుస్తున్నారు. ఇలా సోనూ సామాన్యుల దగ్గరి నుంచి ప్రముఖుల వరకు అందరికీ సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. ఒకానొక సమయంలో ఇతడు జనాలకు సాయం చేసే విషయంలో.. ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా మారిపోయాడు. కష్టం అంటే చాలు.. సాయం చేయడానికి ఎగబడి వెళ్లిపోయేవాడు. నేటికీ ప్రతిరోజూ వేలమంది సోషల్‌ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఆయన ఇంటి వద్దకే వెళ్తున్నారు. అయితే కొందరు మాత్రం ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ టైంపాస్‌ మెసేజ్‌లు చేస్తున్నారు. తాజాగా ఓ యూజర్‌..’భాయ్‌.. నా గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ కొనివ్వమని అడుగుతుంది..మీరు ఏమైనా సహాయం చేస్తారా’ అంటూ సోనూను ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశాడు. దానికి స్పందించిన సోనూసూద్‌…’అది అవుతుందో లేదో కానీ ఐఫోన్‌ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు’ అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక నటుడుగా ఎంతో బిజీగా ఉంటూ కూడా సమయాన్ని వీలు చేసుకుని సమాజ సేవ చేస్తోన్న సోనూకు ఇలాంటి టైంపాస్‌ మెసేజ్‌లు చేయడం ఏంటని కొందరు నెటిజన్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, సోనూ భాయ్‌ భలే ఆన్సర్‌ ఇచ్చారంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడీ ట్వీట్‌ సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది.

Also Read: నెమలి లాంటి నాట్యం, కోయిల లాంటి గాత్రం.. ఎన్నో రికార్డులు దాసోహం.. తాజాగా

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ‘రైతు బంధు’ నగదు అలా ఆపడానికి వీల్లేదంటూ బ్యాంకులకు ఆదేశాలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!