AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Farmers: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్… ‘రైతు బంధు’ నగదు అలా ఆపడానికి వీల్లేదంటూ బ్యాంకులకు ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద...

Telangana Farmers: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్... 'రైతు బంధు' నగదు అలా ఆపడానికి వీల్లేదంటూ బ్యాంకులకు ఆదేశాలు
Rythu Bandhu
Ram Naramaneni
|

Updated on: Jun 22, 2021 | 7:30 PM

Share

తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దీంతో రాష్ట్ర ఆర్థికశాఖామాత్యులు  హరీష్‌రావు , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్‌లు బ్యాంకర్లతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని ఆర్ధిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన / సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలన్నారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు (18002001001, 04033671300) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ కె.రామకృష్ణారావు, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం శ్రీ నటరాజన్, బ్యాంక్ ఆఫ్ బరోడా జిఎం శ్రీ మన్ మోహన్ గుప్తా, ఎస్‌ఎల్‌బిసి డిజిఎం శ్రీ శేష్ కుమార్ ఆదిరాజు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిఎం శ్రీ షేక్ హుస్సేన్, కెనరా బ్యాంక్ డిజిఎం శ్రీ ఎస్‌.వి.జె. వేణు గోపాల్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎజిఎం శ్రీమతి ఆర్.వి.శారద తదితరలు పాల్గొన్నారు.

Also Read: 18వేల కిలోల బాంబు నడిసముద్రంలో పేలితే ఎట్టా ఉంటుందో తెలుసా..?.. వీడియో చూసెయ్యండి

పెద్ద పులితో యువకుల పరాచకాలు.. అది ఏం చేసిందో మీరే చూడండి