AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR : ఏడాది తిరిగే స‌రికి ప్ర‌స్తుత‌మున్న వాసాల‌మ‌ర్రి.. బంగారు వాసాల‌మ‌ర్రి కావాలి : సీఎం కేసీఆర్

ఊరిలో పోలీసు కేసులు ఉండొద్దు. వెంట‌నే ప‌రిష్కారం చేసుకోవాలి. ఒక‌ర్ని చూస్తే మ‌రొక‌రు చిరున‌వ్వు న‌వ్వాలి. ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకునే ప్రేమ ఏర్ప‌డాలి. గ్రామంలో ఐకమ‌త్యం, ప‌ట్టుద‌ల అవ‌స‌రం..

CM KCR : ఏడాది తిరిగే స‌రికి ప్ర‌స్తుత‌మున్న వాసాల‌మ‌ర్రి.. బంగారు వాసాల‌మ‌ర్రి కావాలి :  సీఎం కేసీఆర్
Cm Kcr Speech
Venkata Narayana
|

Updated on: Jun 22, 2021 | 6:13 PM

Share

CM KCR Speech in Vasalamarri : ఏడాది తిరిగే స‌రికి ప్ర‌స్తుత‌మున్న వాసాల‌మ‌ర్రి.. బంగారు వాసాల‌మ‌ర్రి కావాలన్నారు సీఎం కేసీఆర్. “ఊరిలో పోలీసు కేసులు ఉండొద్దు. వెంట‌నే ప‌రిష్కారం చేసుకోవాలి. ఒక‌ర్ని చూస్తే మ‌రొక‌రు చిరున‌వ్వు న‌వ్వాలి. ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకునే ప్రేమ ఏర్ప‌డాలి. గ్రామంలో ఐకమ‌త్యం, ప‌ట్టుద‌ల అవ‌స‌రం. క‌ష్టం, బాధ ఎవ‌రిదైనా ఒక‌టే అనే భావ‌న ఉండాలి. రాష్ట్ర ప్ర‌భుత్వం స‌పోర్ట్‌గా ఉంటుంది.. అన్ని ప‌నులు జ‌ర‌గాలి. ఇవ‌న్నీ సాధ్య‌మైతే వంద‌కు వంద శాతం వాసాల‌మ‌ర్రి బంగారంలా త‌యార‌వుతుంది.” అని కేసీఆర్ గ్రామ ప్రజలకు విన్నవించారు.

పోలీస్ కేసుల పరిష్కారంలో సహకరించాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇవాళ తన దత్తత గ్రామం వాసాల‌మ‌ర్రి గ్రామ సంద‌ర్శ‌న‌లో భాగంగా అక్క‌డ ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనాల అనంతరం నిర్వహించిన బహిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ధి గురించి అనేక కీలక విషయాలు వివరించారు. ఈ ఊరికి క‌నీసం తాను ఇంకో 20 సార్లు వ‌స్తానన్నారు. వ‌చ్చేసారి ఇలా స‌భ పెట్ట‌నని.. . మీ ఊరిలో న‌లుగురు మాత్ర‌మే ప‌రిచ‌యం అయ్యారు. అంద‌రూ ప‌రిచ‌యం అయ్యేలా స‌భ పెట్టాలి అని కేసీఆర్ అన్నారు.

గ్రామ స‌ర్పంచ్, ఎంపీటీసీ నాయ‌క‌త్వంలో అద్భుత‌మైన ప‌ని జ‌ర‌గాలని అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఇక మీదట ఈ జిల్లా కలెక్టరమ్మే మీకు సర్వస్వమని చెప్పిన కేసీఆర్.. మీకు ఆమె అన్ని విధాల అండగా ఉంటారని తెలిపారు. నిధుల సమస్య అన్నది పెద్ద సమస్యే కాదన్న కేసీఆర్ నిధుల విషయం తాను చూసుకుంటానని తెలిపారు. గ్రామ మహిళలు ఆకుల ఆగ‌మ్మ‌, చిన్నూరి ల‌క్ష్మీతో క‌లిసి సీఎం స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. ఆగ‌మ్మ అల్ల నేరేడు పండ్లు ఇచ్చారు. అల్ల నేరేడు చెట్టు లేకుండా ఊరు ఉంట‌దా? ఇక అన్ని చెట్లు నాటాలి. ప్ర‌త్యేక‌మైన ప‌ని జ‌ర‌గాలి అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇంకా సీఎం ఏమేమి విషయాలు చెప్పారన్నది..  ఆయన మాటల్లోనే చూద్దాం..

Read also : CM KCR : గ్రామ మహిళలకు స్వయంగా వంటకాలను వడ్డించిన సీఎం కేసీఆర్, వాసాలమర్రిలో పెద్ద పండుగ శోభ