AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పెద్ద పులితో యువకుల పరాచకాలు.. అది ఏం చేసిందో మీరే చూడండి

ప్రపంచంలో చాలా మంది పెంపుడు జంతువులను ఇష్టపడుతుంటారు. కొందరు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటే, మరికొందరు కుందేళ్లను కూడా ఇష్టంగా సాకుతుంటారు.

Viral Video: పెద్ద పులితో యువకుల పరాచకాలు.. అది ఏం చేసిందో మీరే చూడండి
Playing With Tiger
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 22, 2021 | 5:19 PM

ప్రపంచంలో చాలా మంది పెంపుడు జంతువులను ఇష్టపడుతుంటారు. కొందరు కుక్కల్ని, పిల్లుల్ని పెంచుకుంటే, మరికొందరు కుందేళ్లను కూడా ఇష్టంగా సాకుతుంటారు. వాటికి క్యూట్‌ క్యూట్‌ పేర్లు పెట్టి పిలుచుకుంటారు. వాటితో సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు. పెట్స్‌ను సొంత ఫ్యామిలీ మెంబర్స్‌లాగా ట్రీట్ చేసేవాళ్లు కూడా ఉంటారు. అయితే, ఎవరైనా భయంకరమైన పులితో గేమ్స్ ఆడటం మీరు చూశారా..? అది చాలా అరుదు. కానీ, ఇక్కడ ఓ ఇద్దరు వ్యక్తులు ఏకంగా ఓ పెద్దపులి మెడకే బెల్ట్‌ కట్టి ఆడిస్తున్నారు. దానితో పరాచకాలు కూడా ఆడుతున్నారు. ముందుగా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి.

చూస్తున్నారుగా, వీళ్ల ధైర్యాన్ని..ఏకంగా పులి మెడకే బెల్ట్‌ కట్టారు. పైగా దాన్ని కుక్కపిల్లలా నడిపిస్తున్నారు. ఒకడు పులి మెడలోని బెల్ట్‌ పట్టుకుని ఉండగా, ఇంకొకడు పులి తోక పట్టుకుని లాగే ప్రయత్నం చేశాడు. అంతలోనే పైకి లేచిన పులి ఆగ్రహంతో అతని వైపు గుర్రుగా చూసింది. ఎంతైనా అది పులి. వింటుంది కదా అని పులితోనే ఆటలాడితే అది ఊరుకుంటుందా..? చెప్పండి. అయితే  ఈ పులి సాధుజీవిలా మారిందో..లేక, వాళ్లను పెద్దమనసుతో క్షమించేందో తెలియదు గానీ, ఏమీ చేయలేదు. కానీ, వీడియో చూసిన ప్రతిఒక్కరూ మాత్రం భయంతో వణికిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయబడిన ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. పెద్దపులిని ఆడిస్తున్న ఈ ఇద్దరు యువకులపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. వీరికి ప్రాణాలపై ఆశ లేనట్లుంది.. అందుకే పులితోనే ఆటలాడుతున్నారంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Also Read:  యువతిపై అత్యాచార ఘటనపై స్పందించిన సీఎం జగన్..

 ఆ మహిళలకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో నేరుగా నగదు జమ