Viral Video: సరదాగా ప్రేమ డైలాగ్ చెప్పిన భర్త.. కత్తిపట్టుకుని వెంబడించిన భార్య.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా జనాలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలాంటి అవసరం అయినా.. ఎలాంటి సమస్య అయినా..

Viral Video: సరదాగా ప్రేమ డైలాగ్ చెప్పిన భర్త.. కత్తిపట్టుకుని వెంబడించిన భార్య.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Man
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 22, 2021 | 4:31 PM

Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియా జనాలకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలాంటి అవసరం అయినా.. ఎలాంటి సమస్య అయినా.. మరేదైనా టాపిక్ గానీయండి సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయొచ్చు. తాజాగా ఓ వ్యక్తి తనకు ప్రాణాపాయం ఎదురవగా.. కాపాడండి అంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తికి ప్రాణాపాయం ఎదురైంది స్వయానా అతని భార్య వల్లే కావడం ఇక్కడ విశేషం. తన భార్య తన గుండె చీల్చేందుకు వస్తోందని, తనను కాపాడాలంటూ ఏడుస్తూ రోడ్డుపై పరుగులు తీశాడు. అయితే, ఈ ఘటన వెనుక ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది. అదేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవడమే కాకుండా.. నవ్వుకుంటారు కూడా.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వెనుక అసలు కథం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వీడియోలో పరుగులు తీస్తున్న వ్యక్తి చెప్పిన ఒక్క డైలాగ్ కారణంగా అతని భార్య కత్తి చేతపట్టి అతని వెంట పడింది. అలా భార్య భయంతో రోడ్డుపై పరుగులు తీసిన వ్యక్తి.. సెల్ఫీ కెమెరాను ఆన్ చేశాడు. భయంతో ఏడుస్తూ.. తనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. తన లైఫ్ ప్రమాదంలో ఉందని, తనను రక్షించాలని వేడుకున్నాడు. మొదట అతని పరుగులు, ఏడుపు, భయం చూసి అయ్యోపాపం అనిపించక మానదు. అయితే ఆ తరువాత అతను చెప్పిన విషయం వింటే మాత్రం నవ్వురాకమానదంటే అతిశయోక్తి కాదు.

అంతలా ఏం జరిగిందంటే.. వీడియోలో ఆ వ్యక్తి భయపడుతూ, ఏడుస్తూ తన భార్య తన వెంట పడుతోందని, నా గుండెను చీల్చేందుకు కత్తి పట్టుకుని తరుముతోందని బోరున విలపించాడు. ‘‘నేను ఆగ్రా నగరం నుంచి బయటకు వచ్చాను. రోడ్డుపై పరుగులు తీస్తున్నాను. నిన్న నా భార్య పక్కన కూర్చున్నప్పుడు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు? అని ప్రశ్నించింది. అప్పుడు నేను ‘‘దిల్ చీర్ కే దేఖ్ టెరాహి నామ్ హోగా(నా గుండె చీల్చి చూడు నీ పేరే ఉంటుంది)’’ అని సరదాగా సమాధానం ఇచ్చాను. నా మాటను సీరియస్‌గా తీసుకున్న నా భార్య కత్తి పట్టుకుని గుండెను చీల్చి చూస్తానంటూ వెంటపడుతోంది.’ అని బాధిత వ్యక్తి ఆ వీడియోలో వాపోయాడు.

అయితే, అతని మొఖంలో భయం, రోడ్డుపై పరుగులు తీయడం, అతని ఏడుపు అన్నీ చూసిన వారికి మొదట్లో అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ, పూర్తి విషయం విన్న తరువాత నోరెళ్లబెట్టడం అందరి వంతైంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు సానూభూతి ప్రకటించడంతో పాటు.. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వింత వీడియోనూ మీరూ చూసేయండి.

Viral Video:

View this post on Instagram

A post shared by Vipul Mittal (@vittyvipul)

Also read:

IND Vs NZ, WTC Final 2021 Day 5th Live: వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఐదో రోజు ఆట

ఒంటెలపై యోగా ! బీఎస్ఎఫ్ జవాన్ల తీరుపై మండిపడుతున్న నెటిజన్లు……..తమాషా గిమ్మిక్కుగా మారిపోయిందని ఫైర్

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిటిషన్ పై విచారణ నుంచి వైదొలగిన మరో ‘సుప్రీం’ జడ్జి …శుక్రవారం ఏం తేలనుందో ?

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..