బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిటిషన్ పై విచారణ నుంచి వైదొలగిన మరో ‘సుప్రీం’ జడ్జి …శుక్రవారం ఏం తేలనుందో ?

నారదా కేసులో తమ అఫిడవిట్లను స్వీకరించడానికి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, న్యాయ శాఖ మంత్రి మొలాయ్ ఘటక్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సస్పెన్స్ కొనసాగుతోంది.

బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పిటిషన్ పై విచారణ నుంచి వైదొలగిన మరో 'సుప్రీం' జడ్జి ...శుక్రవారం ఏం తేలనుందో ?
Mamata Banerjee
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 22, 2021 | 4:14 PM

నారదా కేసులో తమ అఫిడవిట్లను స్వీకరించడానికి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, న్యాయ శాఖ మంత్రి మొలాయ్ ఘటక్ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సస్పెన్స్ కొనసాగుతోంది. బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన కేసు విచారణ నుంచి ఇదివరకే జస్టిస్ ఇందిరా బెనర్జీ తప్పుకోగా తాజాగా మంగళవారం మరో జడ్జి జస్టిస్ అనిరుధ బోస్ కూడా తప్పుకున్నారు. ఈ కేసును నేను విచారించదలచుకోలేదు అంటూ ఆయన కూడా వైదొలిగారు. (ఇందిరా బెనర్జీ, ఈయన ఇద్దరు కూడా కోల్ కతాకు చెందినవారే). దీంతో మరో న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా.. మరో బెంచ్ కి ఈ కేసు విచారణను నివేదించారు. జస్టిస్ వినీత్ శర్మ నేతృత్వంలోని ఈ బెంచ్ శుక్రవారం దీనిపై విచారణ జరపనుంది. ఇది తమ ముందుకు వచ్చిన కొత్త కేసు అని, ఈ ఫైలును తాము పరిశీలించాల్సి ఉందని, అందువల్ల శుక్రవారం విచారిస్తామని ఆయన చెప్పారు.

నారదా కేసు విచారణను బెంగాల్ బయట జరపాలన్న సీబీఐ అభ్యర్థనపై తమ వాదన వినిపించడానికి అఫిడవిట్లు దాఖలు చేస్తామని, అందుకు అనుమతించాలని మమతా బెనర్జీ, న్యాయ శాఖ మంత్రి కలకత్తా హైకోర్టును కోరగా.. అందుకు కోర్టు నిరాకరించింది. వీరు కావాలనే మంచి సమయం చూసుకుని ఈ కోర్కె కోరారని….తమ ఇష్టం వచ్చినట్టు వీటిని దాఖలు చేయజూస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తునకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని.. కోర్టు జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆదేశించిన సంగతి విదితమే. అయితే ఆ ఉత్తరువులపై స్టే ఇవ్వాలన్న మమత విజ్ఞప్తికి కోర్టు నో చెప్పింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Raw Garlic Benfits : పచ్చి వెల్లుల్లి తింటే అద్భుత ప్రయోజనాలు..! ఈ నాలుగు సమస్యలకు చక్కటి పరిష్కారం..

National Kissing Day: అమెరికాలో కిస్సింగ్ డే ఈరోజు.. ఎందుకు పండుగలా జరుపుకుంటారంటే..