COVID-19 Vaccine- infertility: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా? అసలు నిజం ఏంటంటే..
COVID-19 Vaccine- infertility : లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంటున్న కరోనా మహమ్మారి పీచమణచాలంటే కోవిడ్ వ్యాక్సీన్..
COVID-19 Vaccine- infertility : లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకుంటున్న కరోనా మహమ్మారి పీచమణచాలంటే కోవిడ్ వ్యాక్సీన్ ఒక్కటే మార్గం అని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సీనేషన్ ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నాయి. కంపెనీ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడం.. ఆ వెంటనే వ్యాక్సిన్లు సరఫరా, వ్యాక్సినేషన్ ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయితే కోవిడ్ వ్యాక్సీన్ల ప్రభావంపై ఇప్పుడు సరికొత్త సందేహాలు తెరపైకి వస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సీన్ వేసుకున్న వారిలో దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని, ప్రాణాలు పోతున్నాయంటూ కొన్ని రకాల పుకార్లు నిన్న మొన్నటి వరకు చక్కర్లు కొట్టగా.. ఇప్పుడు సందేహం వెలుగులోకి వచ్చింది. కోవిడ్ వ్యాక్సీన్లు తీసుకున్న వారిలో శృంగార పటుత్వం తగ్గడం, సంతానలోపం, సంతాన సమస్యలు తలెత్తుతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. అయితే సోషల్ మీడియా జనాలను ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వార్తలను నమ్మిన పలువురు కోవిడ్ వ్యాక్సీన్ తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
ఈ సరికొత్త ప్రచారం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆ వాదనలో ఎలాంటి నిజం లేదంటూ కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఆడవారిలో గానీ, మగవారిలో గానీ ఇలా జరిగిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇది కేవలం దుష్ప్రచారం మాత్రమే అని, ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మొద్దని కేంద్ర ప్రభుత్వం హితవుచెప్పింది. అన్ని టెస్టులు చేసిన తరువాత వ్యాక్సీన్లు ఇవ్వడం జరుగుతుందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. వ్యాక్సీన్‌తోనే కోవిడ్19 వైరస్‌ను అడ్డుకోవచ్చునని చెప్పారు. వదంతులు నమ్మి వ్యాక్సీన్‌కు దూరం అవ్వొద్దని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
Also read:
Pragya Jaiswal: ‘ఎఫ్ 3’లో మరో హీరోయిన్.. స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేయనున్న ప్రగ్యా జైస్వాల్..
Different Marriage: అక్కడ జరిగే పెళ్లి తంతే వేరు.. ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా మారి..!