Rajitha Chanti |
Updated on: Jun 22, 2021 | 3:00 PM
ఆ తర్వాత గుంటురోడు, ఆచారి అమెరికా యాత్ర వంటి మూవీస్ చేసినా.. ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించినా.. అవేవీ ఆమెకు పెరు తెచ్చిపెట్టలేకపోయాయి.
లేటెస్ట్ గా బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో.. హీరోయిన్ గా నటిస్తుంది ప్రగ్యా జైస్వాల్.
తాజా సమాచారం ప్రకారం ప్రగ్యా జైస్వాల్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 లో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట.
ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తుండగా.. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మాస్ అండ్ యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా.. క్లైమాక్స్ కు ముందు ఈ స్పెషల్ సాంగ్ ను కంపోజ్ చేస్తున్నారు. అయితే ఈ ఆఫర్ కు ప్రగ్యా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తుంది.
ఈ మూవీని డిసెంబర్ లేదా సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.