Vamsadhara tribunal : ట్రిబ్యూనల్ తీర్పు పై సీఎం హ్యాపీ, నేరడి బ్యారేజ్ శంఖుస్థాపనకి సీఎం తోపాటు, ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానిస్తాం : సీఎం జగన్

వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు సంతోషకరమని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ, ఒడిశా ఉభయ రాష్ట్రాలకూ ఇది ప్రయోజనకరంగా..

Vamsadhara tribunal : ట్రిబ్యూనల్ తీర్పు పై సీఎం హ్యాపీ, నేరడి బ్యారేజ్ శంఖుస్థాపనకి సీఎం తోపాటు, ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానిస్తాం : సీఎం జగన్
CM YS Jagan
Follow us

|

Updated on: Jun 22, 2021 | 2:36 PM

CM Jagan Neradi barrage review : వంశధార ట్రైబ్యునల్‌ తీర్పు సంతోషకరమని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ, ఒడిశా ఉభయ రాష్ట్రాలకూ ఇది ప్రయోజనకరంగా ఉందన్నారు. గెజిట్‌ విడుదల కాగానే నేరడి నిర్మాణంపై దృష్టిపెట్టండని సీఎం అధికారులకు ఆదేశించారు. సుదీర్ఘకాలం తర్వాత ఈ సమస్యకు పరిష్కారం లభించినటైయ్యిందని సీఎం జగన్ సంతోషం వ్యక్తం చేశారు. వెంటనే నేరడి వద్ద వంశదారపై బ్యారేజీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించాలని అధికారులకు జగన్ సూచించారు. ఈలోగా దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధంచేసుకోవాలన్నారు.

తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వంశధార ట్రిబ్యూనల్ తీర్పు పై సీఎంఓ అధికారులతో సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పు ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే కాకుండా ఒడిశా రాష్ట్రానికీ ప్రయోజకరమన్న ఆయన, పొరుగు రాష్ట్రాలతో సంత్సంబంధాలు కోరుకుంటున్నామని తెలిపారు.

నేరడి బ్యారేజీ ద్వారా ఇరు రాష్ట్రాల ప్రజలకూ మంచి జరుగుతుందని, నేరడి బ్యారేజ్‌ నిర్మాణం కోసం జరిగే శంఖుస్థాపన కార్యక్రమానికి ఒడిశా సీఎంతోపాటు, ఆ రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తామని సీఎం తెలిపారు. వివాదాలతో కాకుండా పరస్పర సహకారంతో ముందుకు సాగాలన్నదే మన విధానమని ఆంధ్రప్రదేశ్ సీఎం ఉద్ఘాటించారు.

Read also : Mudragada : క్షత్రియులు, వైశ్యులు, బ్రాహ్మణులు సమాజానికి సేవ చేసిన వారే.. అలా అవమానించొద్దు : సీఎంకు ముద్రగడ లేఖ