AP DSC: ‘2008 డీఎస్సీ’లకు కాంట్రాక్ట్‌ కొలువు.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ..

AP DSC: డీఎస్సీ-2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల్లో అర్హులైన 2,193 మందికి కాంట్రాక్టు బేస్‌డ్‌గా ఉద్యోగాలు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి...

AP DSC: ‘2008 డీఎస్సీ’లకు కాంట్రాక్ట్‌ కొలువు.. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ..
Ap Dsc
Follow us
Shiva Prajapati

|

Updated on: Jun 22, 2021 | 9:26 AM

AP DSC: డీఎస్సీ-2008 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల్లో అర్హులైన 2,193 మందికి కాంట్రాక్టు బేస్‌డ్‌గా ఉద్యోగాలు ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వీరిని సెకండరీగ్రేడ్‌ టీచర్లుగా నియమించి మినిమమ్‌ టైమ్‌ స్కేలు వర్తింపచేయనున్నట్లు సదరు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు సెలెక్ట్ అయిన వారంతా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే 60 ఏళ్లు పూర్తయ్యే వరకు ఉపాధ్యాయులగా పని చేసే అవకాశం కల్పించారు.

అయితే, ఈ నియామకాలన్నీ పూర్తిగా కాంట్రాక్టు ప్రాతిపదికగా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రకారం.. ఇప్పుడు ఉపాధ్యాయ ఉధ్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు కాంట్రాక్టు ఉద్యోగులకు వర్తించే నిబంధనలే విరికీ వర్తించనున్నాయి. అంటే.. రెగ్యూలర్ టీచర్లకు వర్తించే ప్రయోజనాలను వీరు క్లెయిమ్‌ చేయడానికి వీల్లేదు. అలాగే, తదుపరి నిర్వహించే డీఎస్సీలో పెట్టే అకడమిక్/టెక్నికల్ క్వాలిఫికేషన్లను వీరు వచ్చే రెండేళ్లలో సాధించాల్సి ఉంటుంది. దాంతోపాటు.. నియామక తేదీ నుంచి రెండేళ్లలో వీరు ఆరు నెలల బ్రిడ్జి కోర్స్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే.. డీఎస్సీ-2008కి సంబంధించి 4,657 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే, మారిన ఎంపిక విధానం ప్రకారం, ప్రభుత్వం నియమించిన ఎమ్మెల్సీల కమిటీ సిఫారసు మేరకు కేవలం 2,193 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు వీరికి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Also read:

Suresh babu : నిర్మాత సురేష్ బాబునీ వ్యాక్సిన్ పేరుతో బురిడీ కొట్టించిన కేటుగాడు.. లక్ష రూపాయలు ఫసక్