AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suresh babu : నిర్మాత సురేష్ బాబునీ వ్యాక్సిన్ పేరుతో బురిడీ కొట్టించిన కేటుగాడు.. లక్ష రూపాయలు ఫసక్

విధి ఎలా ఉంటే అలా జరుగుతుందనుకోవాలో.. ఒక్కోసారి ఎంతటి వారానై బొక్క బోర్లా పడతారనుకోవాలో తెలీని పరిస్థితి. ఇదే స్థితి ఇప్పుడు ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత..

Suresh babu : నిర్మాత  సురేష్ బాబునీ వ్యాక్సిన్ పేరుతో బురిడీ కొట్టించిన కేటుగాడు.. లక్ష రూపాయలు ఫసక్
Producer D Suresh Babu
Venkata Narayana
|

Updated on: Jun 22, 2021 | 9:24 AM

Share

D suresh babu : విధి ఎలా ఉంటే అలా జరుగుతుందనుకోవాలో.. ఒక్కోసారి ఎంతటి వారానై బొక్క బోర్లా పడతారనుకోవాలో తెలీని పరిస్థితి. ఇదే స్థితి ఇప్పుడు ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఎదుర్కొంటున్నారు. తన దగ్గర కొవిడ్ వ్యాక్సీన్ లు ఉన్నాయని ఏకంగా సాక్షాత్తూ ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్, విద్యావంతుడైన డి సురేష్ బాబు దగ్గర లక్ష రూపాయలు కొట్టేశాడు ఓ మహా మాయగాడు.

టీకా సప్లై చేస్తానని లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేయమనడంతో అతడిని నమ్మి లక్ష రూపాయలు సురేష్ బాబు మేనేజర్.. సదరు వ్యక్తి అకౌంట్ కి మనీ ట్రాన్స్ ఫర్ చేశాడు. అయితే, తర్వాత ఎన్ని సార్లు ఫోన్ చేసినప్పటికీ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి, చివరికి మోసం జరిగిందని తెలుసుకున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ.. నిన్న ఒక్కరోజులోనే 85 లక్షలకు పైగా ప్రజలకు వ్యాక్సినేషన్

భారత దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకాల పంపిణీ జరుగుతోంది. టీకా కార్యక్రమం చేపట్టి నిన్నటికి 157వ రోజుకు చేరగా, ప్రపంచంలోనే అత్యధికంగా నిన్న ఒక్కరోజులోనే దేశవ్యాప్తంగా సుమారు 85 లక్షలకు పైగా ప్రజలకు కరోనా టీకా వేశారు. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 16 లక్షలకు పైగా మందికి కొవిడ్ టీకాలు వేశారు. రికార్డు స్థాయిలో టీకాల పంపిణీ పై ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. టీకాలు పంపిణీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కృషిని ప్రధాని ప్రశంసించారు.

” ఇవాళ రికార్డు స్థాయిలో జరిగిన టీకా పంపిణీ జరగడం పట్ల సంతోషంగా ఉంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో వ్యాక్సినే మన ప్రధాన ఆయుధం. టీకా తీసుకున్న వారికి.. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తున్న ఫ్రంట్​లైన్​ వర్కర్లకు నా అభినందనలు. పేదలు, మధ్య తరగతి, యువతే ప్రధానంగా ఈ విడత వ్యాక్సినేషన్ జరుగుతోంది. అందరూ వ్యాక్సిన్​ తీసుకోవాలి.” అని నరేంద్ర మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.

కాగా, కేంద్రం సవరించిన టీకా విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక్కరోజే 85.15 లక్షలకుపైగా డోసుల పంపిణీ జరిగింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 28.36 కోట్ల డోసుల టీకా పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కేంద్రం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానంలో భాగంగా 75 శాతం టీకాలను కేంద్రమే ఉచితంగా అందిస్తుంది. 25 శాతం టీకాలను ప్రైవేటుకు కేటాయిస్తోంది. అంతకుముందు కేవలం 50 శాతం మాత్రమే ఉచితంగా పంపిణీ చేసేది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఈ విధానంలో మార్పులు చేసిన కేంద్రం నూతన విధానంలో టీకాల పంపిణీ కార్యక్రమం అమలు చేస్తోంది.

Read also : Vasalamarri visit : దత్తత గ్రామంలో ఇవాళ సీఎం కేసీఆర్ పర్యటన, గ్రామస్తులందరితో కలిసి భోజన కార్యక్రమం, బహిరంగ సభ