AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారా ? అయితే ఇంట్లోనే రెడీ చేసే ఈ డ్రింక్స్‏తో ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టోచ్చు…

దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. ఇటు సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా మరింత శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో చాలా మందికి జలుబు

Health Tips: వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారా ? అయితే ఇంట్లోనే రెడీ చేసే ఈ డ్రింక్స్‏తో ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టోచ్చు...
Health Tips
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2021 | 9:08 AM

Share

దేశంలో కరోనా కేసులు తగ్గినప్పటికీ.. ఇటు సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. వర్షాకాలంలో ఆరోగ్యంగా మరింత శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ఈ సీజన్ లో చాలా మందికి జలుబు, దగ్గుతోపాటు… ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో సప్లిమెంట్స్ కంటే కూడా.. మన పురాతన పద్దతిలో చేసే కషాయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇటు కరోనాను నియంత్రించడానికి రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం చాలా మంది ఇంట్లో చేసిన వంటకాలకు.. తాజా పండ్లు కూరగాయాలను తీసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల తగ్గించడమే కాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇంట్లో తయారు చేసే కొన్ని రకాల డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అశ్వగంధ.. అశ్వగంద వివిధ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే.. ఆయుర్వేధంలో దీనిని పలు చికిత్సలకు ఉపయోగిస్తారు. ఇది పెప్టైడ్స్, అమైనో ఆమ్లాలు, లిపిడ్లు వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది.

బ్రహ్మి.. బ్రహ్మి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనిని ఆత్రుత, మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ఒత్తిడి, నిరాశను తొలగిస్తుంది. బ్రహ్మిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

తులసి విత్తనాలు.. తులసి విత్తనాలు.. సబ్జా రిఫ్రెష్ డ్రింక్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సబ్జా విత్తనాలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు.. విటమిన్లు ఎ, బీ, ఇ, కె, కాల్షియం.. మెగ్నీషియం.. ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనాలలో ఫ్లేవనాయిడ్లు, ఫినాల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. ప్రీ రాడికల్స్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

సోంపు గింజలు.. సోంపులో ట్రాన్స్ అనెథోల్ ఉంటుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను తగ్గిచడంలో సహాయపడుతుంది. సోంపు నీరు తాగడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. మంటను తగ్గిస్తుంది. శ్వాస కోశ నాళాన్ని శుద్ది చేస్తుంది. ఇందులో విటమిన్ ఎ, సీ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.

గసగసాలు.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి గసగసాలు ఉపయోగపడతాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. దీనిని గసగసాల లేదా వెటివర్ గడ్డి అంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇందులో జింక్ పుష్కలంగా ఉండడం వలన ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

Also Read: AP Intermediate Board: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూనియర్‌ కాలేజీల ప్రొవిజినల్‌ అఫిలియేషన్‌ దరఖాస్తు గడువు పొడిగింపు..

Doctors Negligence: కరీంనగర్ జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం.. ఒకరికి బదులు మరొకరికి ఆపరేషన్‌కు యత్నం.. పేషెంట్ అరుపులతో అప్రమత్తం!

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..