Kondapindi Aaku Pappu: కిడ్నీ స్టోన్స్ ను కరిగించే కొండపిండాకు పప్పు కూర తయారీ విధానం

Kondapindi Aaku Pappu: పూర్వకాలంలో ఇప్పటిలా పిజ్జాలు, బర్గర్లు లేవు.. డిఫరెంట్ స్టైల్ లో మసాలా ఫుడ్ లేదు.. పొలం గట్టున దొరికే పొన్నగంటి కూర, కొండపిండాకు...

Kondapindi Aaku Pappu: కిడ్నీ స్టోన్స్ ను కరిగించే కొండపిండాకు పప్పు కూర తయారీ విధానం
Kondapindaku
Follow us

|

Updated on: Jun 23, 2021 | 10:18 AM

Kondapindi Aaku Pappu: పూర్వకాలంలో ఇప్పటిలా పిజ్జాలు, బర్గర్లు లేవు.. డిఫరెంట్ స్టైల్ లో మసాలా ఫుడ్ లేదు.. పొలం గట్టున దొరికే పొన్నగంటి కూర, కొండపిండాకు ఇలాంటి ఆకుకూరలను తెచ్చి.. ఆరోజు అన్నంలోకి కూర చేసుకుని తినేసేవారు.. అవి ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఫ్రీగా దొరికే ఆ ఆకుకూరలమీద ఇప్పుడు అందరికి అంత ఆసక్తి లేదు.. అదే ఏ విదేశీవారో అందులో ఔషధ గుణములున్నాయని చెబితే.,. అప్పుడు మనం వాటి వెంట పరుగులుపెడతాం.. ఈరోజూ పొలం గట్టుమీద దొరికే కొండపిండాకు పప్పు తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు :

కొండపిండాకు- కట్ట, ఉల్లిపాయముక్కలు- కప్పు, ఎండుమిర్చి- నాలుగు, పచ్చిమిర్చి- రెండు, చింతపండు రసం- మూడు చెంచాలు, నానబెట్టిన పెసర పప్పు – అరకప్పు, వెల్లుల్లిరెబ్బలు- నాలుగు, ఆవాలు- పావుచెంచా, జీలకర్ర- అరచెంచా, కరివేపాకు- రెబ్బ, ఉప్పు,- రుచికి సరిపడా నూనె- తగినంత.

తయారీ విధానం :

ముందుగా స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవన్నీ వేగిన అనంతరం ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకోవాలి. అవీ.. మగ్గాక నానబెట్టిన పెసర పప్పు వేసి వేయించుకోవాలి. పప్పు మగ్గిన తర్వాత చింతపండురసం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా కొండపిండాకు వేసి కలిపి పావుగంటపాటు ఉడికించుకోవాలి. పెసర పప్పుతో మగ్గి కొండపిండాకు ఉడుకుతుంది. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యానికి రక్షనిచ్చె కొండపిండాకు పప్పు రెడీ. ఇది అన్నంలోకి చపాతీల్లోకి బాగుంటుంది.

*పెసర పప్పు ఇష్టం లేనివారు ఇదే రెసిపిలో శనగపప్పు తో కూడా కొండపిండాకు పప్పు చేసుకోవచ్చు .

ప్రయోజనాలు:

ఈ ఆకుకూరని పాషాణబేధి అని పిలుస్తారు. దీనిలో నీటిశాతం తక్కువ. పీచు ఎక్కువ. మూత్రపిండాల్లో రాళ్లున్నప్పుడు వాటిని కరిగించుకోవడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో క్యాల్షియంతో పేరుకుపోయిన పదార్థాలున్నప్పుడు వాటిని తొలగించుకోవడానికి కొండపిండాకు కూర తింటారు. ఎన్నాళ్లు తిన్నా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. పప్పుతో కలిపి తినొచ్చు.

Also Read: మోనిత విషయం తనకు వదిలేయమన్న భాగ్యం.. గీతలు చెరిపి కార్తీక్ తలరాత మార్చే శక్తి దీపకే ఉందంటున్న సౌందర్య

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!