Karhika Deepam: మోనిత విషయం తనకు వదిలేయమన్న భాగ్యం.. గీతలు చెరిపి కార్తీక్ తలరాత మార్చే శక్తి దీపకే ఉందంటున్న సౌందర్య

Karthika Deepam: కార్తీక్ చికిత్స అందిస్తుంటే లక్ష్మణ్ వస్తాడు. తనకు వైద్యం చేసి ఉద్యోగం ఇస్తాడు నెలకు రూ. 25 వేల జీతం అని చెబుతుంటే దీప వస్తుంది. నువ్వు దేవతవు తల్లి.. స్నేహితులు, సొంతవారు సాయం చేయలేదు..

  • Updated On - 12:04 pm, Tue, 22 June 21
Karhika Deepam: మోనిత విషయం తనకు వదిలేయమన్న భాగ్యం.. గీతలు చెరిపి కార్తీక్ తలరాత మార్చే శక్తి దీపకే ఉందంటున్న సౌందర్య
Karthika Deepam

Kathika Deepam Today : రోజుకో ట్విస్ట్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీక్ దీపం సీరియల్ ఈరోజు 1072 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు ఎపిసోడ్ లోని హైలెట్స్ ను చూద్దాం..

కార్తీక్ మనసులో చేయని నేరానికి దీప ఎంత నరకం అనుభవించి ఉంటుంది.. ఇప్పుడు నాకు తెలుస్తోంది. అనుకుంటాడు కార్తీక్. ఇంతలో ,మోనిత పిల్లల్ని ఆడుకోమని బయటకు పంపించి అనుకోకుండా ఇలా వచ్చాను అంటూ..గోడమీద రెండో కొట్టేసి వస్తాను.. మళ్ళీ కలుద్దాం అని నవ్వుతు వెళ్ళిపోతుంది మోనిత.

కార్తీక్ చికిత్స అందిస్తుంటే లక్ష్మణ్ వస్తాడు. తనకు వైద్యం చేసి ఉద్యోగం ఇస్తాడు నెలకు రూ. 25 వేల జీతం అని చెబుతుంటే దీప వస్తుంది. నువ్వు దేవతవు తల్లి.. స్నేహితులు, సొంతవారు సాయం చేయలేదు.. సోదరిలా సాయం చేశావు దీపమ్మ అంటూ కార్తీక్ పక్కన దీపని నిలబెట్టి ఇద్దరికీ దణ్ణం పెట్టుకుంటారు.. మీ ఇద్దరు మాకు దేవుళ్లమ్మ అంటాడు. దీప హిమని తీసుకుని కూరగాయలు కొనడానికి వెళ్తుంది.

శ్రావ్య అత్తయ్య అంటూ సౌందర్య కోసం వెతుకుతుంటే… భాగ్య సౌందర్యంతో మాట్లాడుతుంది. మీకులా మంచి తనంతో ఉంటె మోనిత ను డీల్ చేయలేరు.. నేను మాట్లాడతా.. మా చెప్పిన దారిలో మాట్లాడితే..దెబ్బకి మోనిత దారిలోకి వస్తుంది. ఇప్పుడు మోనిత ఆస్తిలో సగం వాటా అడిగితె రాసి ఇచ్చేస్తారా.. అప్పుడు నా కూతురుకి దాని పిల్లలకు ఏముంటుంది.. మళ్ళీ పిండివంటలు అమ్ముకోవాలినదేనా.. ఎంత నష్ట జాతకురాలు దీప.. దాని జీవితంలో సుఖ పడే యోగం లేదా అంటుంది భాగ్యం.. తనకు మోనిత తో మాట్లాడే అవకాశం ఇవ్వమని చెప్పి.. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

మోనిత మాటలు.. తన ప్రవర్తన గుర్తు తెచ్చుకుంటాడు. ఇంతలో శౌర్య వచ్చి.. ఆ గీతలు ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లెమా అని అడుగుతుంది. దీప పట్ల తన ప్రవర్తన గుర్తు తెచ్చుకున్న కార్తీక్.. శౌర్యను ఎత్తుకుని తిప్పుతాడు.. అప్పుడే సౌందర్య లోపలి వచ్చి.. మోనిత నికే కాదు నాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. దీప ఒక్కదానికే మోనిత భయపడుతుంది. ఈ ప్రాబ్లెమ్ తనకే తీర్చే శక్తి ఉంది అంటుంది.

ఆ గీతలను చెరిపేసి నీ రాతల్ని మార్చుకునే శక్తి ఒక్క దీపకు మాత్రమే ఉంటుంది అంటుంటే.. అలా నువ్వే చేయాలి.. అంటే అది జరిగే పనేనా మమ్మీ అంటుంటే.. ప్రయత్నించారా అంటుంది.. కష్టం మమ్మీ.. దీప అసలు మాట్లాడడం లేదని మౌనంగానే ఉంటుందని . తను చూసే చూపుల్ని భరించలేకపోతున్నా.. ఆ బాధ్యత ఎందుకు తీసుకుంటుంది.. దీప చూపులు నన్ను ఆహుతి చేసేలా ఉంటె.. పిల్లలను అయోమయంగా చూస్తుంటె.. నేను తట్టుకోలేకపోతున్నా అంటాడు..

హిమ..దీపతో మాట్లాడుతూ.. వారణాసి బయటకు వెళ్తే ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు.. నాకు దిగులుగా ఉంది. డాడీ నువ్వు నా దగ్గరే ఉన్నా.. భయంగా ఉంది.. నాన్న నీతో మాట్లాకపోయినా మాతో బాగానే ఉండేవారు.. నాన్న నీతో మాట్లాడక పోయినా నువ్వు మేము ఉంటె చాలు అన్నట్లు ఉండే దానివి.. అందరం ఒకే ఇంట్లో ఉన్నా దిగులుగా ఉంటుంది. వారణాసి కూడా ఇప్పుడు ఫోన్ ఎట్టకపోతే తనకి కూడా కోపం వచ్చింది అనిపిస్తుంది. అంటూ హిమ తన మనసులో ఆవేదనని దీపకు చెప్పుతుంది.
రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారనుంది. కార్తీక్ .. దీపతో కన్నీటి మధ్య తన బాధను చెప్పే ప్రయత్నం చేస్తాడు.. దీప అంటూ.. భగవంతుడు మరో రూపంలోనైనా నాకు తెలియజేసి ఉండొచ్చు కదా.. నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిన వ్యక్తికే.. నా వల్ల అలా జరగడం.. అంటూ కార్తీక్ చెబుతుంటే… దీప షాక్ తో మీకు పిల్లలు పుట్టరని విషయం డాక్టర్లు చెప్పలేదా మోనిత సి చెప్పిందా అని అడుగుతుంది. డాక్టర్లు చెప్పిందే మోనిత నాకు చెప్పింది అంటాడు.. అంతేకాదు.. నీకో విషయం తెలుసా.. మోనిత ఇంట్లో ఫుల్ గా తాగాను.. మోనిత మన మధ్య తప్పు జరిగింది అని చెప్పేవరకూ నాకు ఏమి తెలియదు.. అంతగా తగునా అంట మత్తులో ఉన్నాను అని కార్తీక్ దీపకు చెప్పి.. ఏడుస్తుంటే.. షాక్ లో న్నా దీప ఏ నిర్ణయం తీసుకుంటుంది.. మోనిత .కుట్రను బయటపెట్టడానికి ఏ నిర్ణయం తీసుకుంటుంది చూడాలంటే … రేపటి ఎపిసోడ్ వరకూ ఆగాల్సిందే..

Also Read: అతడు మా నాన్న కంటే చిన్నవాడు.. మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్.. ఆ నటుడితో రిలేషన్‏ను బయటపెట్టిన అవికా గోర్

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu