Defamation Case: మాజీ ప్రధానికి షాక్.. పరువు నష్టం కేసులో భారీ జరిమానా..

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు సివిల్ కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఈ తీర్పును వెల్లడించింది.

Defamation Case: మాజీ ప్రధానికి షాక్.. పరువు నష్టం కేసులో భారీ జరిమానా..
Former Pm H.d. Deve Gowda
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 22, 2021 | 3:34 PM

మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు సివిల్ కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల నాటి వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ఈ తీర్పును వెల్లడించింది. రూ.2కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011 జూన్‌ 28న ‘గౌడర గర్జన’ పేరుతో నిర్వహించిన ఓ టీవీ షో ఆయన పాల్గొన్నారు. ఈ ఛానల్‌కు ఆయన ప్రత్యేకంగా  ఇంటర్వ్యూ  ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌(NICE ) ప్రాజెక్టుపై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ పిటిషన్‌ పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్‌ కోర్టు.. NICE ఆరోపణల్లో నిజం ఉందని తేల్చింది.

NICE ప్రాజెక్టును గతంలో కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టు తమ తీర్పుల్లో సమర్థించాయని న్యాయస్థానం గుర్తుచేసింది. ఇది కర్నాటక ప్రజల ప్రయోజనాల కోసం కంపెనీ చేపట్టిన పెద్ద ప్రాజెక్టు అని సమర్థించింది, ఇలాంటి ప్రాజెక్టుపై పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టు ఆలస్యమవుతుందని అభిప్రాయపడింది. కంపెనీ పరువుకు భంగం కలిగించినందుకు  NICEకి దేవెగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి :  పెళ్లికి హైదరాబాద్‏లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా ? తక్కువ ఖర్చయ్యే ప్రసిద్ధి చెందిన మార్కెట్లు ఎంటో తెలుసా..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?