AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి హైదరాబాద్‏లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా ? తక్కువ ఖర్చయ్యే ప్రసిద్ధి చెందిన మార్కెట్లు ఎంటో తెలుసా..

హైదరాబాద్ అతి తక్కువ ఖర్చుతో షాపింగ్ చేయడానికి బోలెడన్ని మార్కెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాస్తు శిల్పాలు, రుచికరమైన ఆహారంతోపాటు..

పెళ్లికి హైదరాబాద్‏లో షాపింగ్ చేయాలనుకుంటున్నారా ? తక్కువ ఖర్చయ్యే ప్రసిద్ధి చెందిన మార్కెట్లు ఎంటో తెలుసా..
Hyderabad
Rajitha Chanti
|

Updated on: Jun 22, 2021 | 1:07 PM

Share

హైదరాబాద్ అతి తక్కువ ఖర్చుతో షాపింగ్ చేయడానికి బోలెడన్ని మార్కెట్స్ అందుబాటులో ఉన్నాయి. వాస్తు శిల్పాలు, రుచికరమైన ఆహారంతోపాటు.. ఆడవారి షాపింగ్ మార్కెట్స్.. ఇంటి అలంకరణ వస్తువులు ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల పురాతన వస్తువులు.. ఆభరణాలతోపాటు.. నిజాం కాలం నాటి చారిత్రక కట్టడాలు కూడా ప్రసిద్ధి చెందాయి. అలాగే హైదరాబాద్ బిర్యానీకి మరింత ఫేమస్. దేశవ్యాప్తంగా హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపు ఎక్కువగానే ఉంది. అయితే ఇక్కడ షాపింగ్ చేయడానికి కొన్ని అనువైన.. అతి తక్కువ ఖర్చుతో లభించే మార్కెట్స్ ఎక్కువగానే ఉన్నాయి. మరి అవి ఏ వస్తువులకు ప్రసిద్ది చెందాయో తెలుసుకుందామా.

లాడ్ బజార్.. దీనిని చండి బజార్ అని కూడా పిలుస్తుంటారు. పురాతన నిజాం కాలం నాటి చారిత్రాత్మక కట్టడం చార్మినర్ కు దగ్గర్లో ఉంటుంది. ఇది ఎక్కువగా గాజులకు ఫేమస్. కేవలం స్త్రీల ఆభరణాలు మాత్రమే కాకుండా.. ఇక్కడ వెండి సామాగ్రి, పట్టు చీరలు, పెళ్లి వస్తువులు, సుగంధ ద్రవ్యాలు అధికంగా లభిస్తాయి.

మొజామ్ జాహి మార్కెట్… ఇది నిజాం కాలం నాటి మార్కెట్. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు మొజ్జా జా బహదూర్ పేరును ఈ మార్కెట్ కు పెట్టారు. ఇక్కడ ఫ్రేష్ ప్రూట్స్ లభిస్తాయి. అంతేకాదు.. పెళ్లిలకు.. శుభకార్యాలకు కావాల్సిన పండ్లు, కూరగాయలు.. సుగంద ద్రవ్యాలు లభించడమే కాకుండా.. పరిసరాల్లో వివాహనికి సంబంధించిన వస్తువులు లభిస్తాయి.

షాపింగ్ హబ్ నాంపల్లి ఈ మార్కెట్ కూడా హైదరాబాద్ లో చాలా ఫేమస్. ఇక్కడ అతి తక్కువ ధరకు గాజులు, బ్యాగులు వంటి ప్రతి వస్తువులను విక్రయిస్తుంటారు. ప్రతి సంవత్సరం జనవరి… ఫిబ్రవరి.. మార్చి నెలలో ఇక్కడ ప్రదర్శన నిర్వహిస్తుంటారు.

బేగం బజార్.. ఈ మార్కెట్ దాదాపు 150 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ ఇంటి అలంకరణ వస్తువులతోపాటు.. వివాహానికి సంబంధించిన ఆభరణాలు, పరిమళ ద్రవ్యాలు, గృహోపకరణాలు లభిస్తుంటాయి. హైదరాబాద్ లోనే అతి పెద్ద మార్కెట్ ఇది.

కోటి మార్కెట్.. దీనిని రెసిడెన్సీ మార్కెట్ అని కూడా అంటారు. ఇది బ్రిటిష్ పాలన నుంచి అందుబాటులో ఉంది. ఇక్కడ ఎక్కువగా.. స్త్రీల ఆభరణాలతోపాటు.. పుస్తకాలను ఎక్కువగా విక్రయిస్తుంటారు.

Also Read: Shocking Video: సేద తీరుతున్న పావురాన్ని మట్టుబెట్టిన మొసలి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

Electric Vehicles: పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే ఉత్పత్తి చేసే దిశలో ‘ఆడి’ ..2026 వరకే నాన్-ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి