Electric Vehicles: పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలనే ఉత్పత్తి చేసే దిశలో ‘ఆడి’ ..2026 వరకే నాన్-ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి
Electric Vehicles: ప్రస్తుతం కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. పెట్రోల్ డీజిల్ వెర్షన్లను ఇప్పుడు విడుదల చేస్తున్నప్పటికీ..భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ అంటే బ్యాటరీతో నడిచే వాహనాలను తయారు చేయడానికే ఆలోచిస్తున్నాయి.
Electric Vehicles: ప్రస్తుతం కార్ల కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించాయి. పెట్రోల్ డీజిల్ వెర్షన్లను ఇప్పుడు విడుదల చేస్తున్నప్పటికీ..భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ అంటే బ్యాటరీతో నడిచే వాహనాలను తయారు చేయడానికే ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఈవీల తయారీపై తమ దృష్టిని కేంద్రీకరించాయి. కొన్ని కంపెనీలు తమ ఈవీ వెహికల్స్ ను విడుదల చేశాయి. తాజాగా జర్మన్ లగ్జరీ కార్ల కంపెనీ ఆడీ 2026 చివరికి కొత్తగా అంతర్గత దహన ఇంజన్ (పెట్రోల్, డీజిల్) మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేయాలని ఆలోచిస్తోంది. అంటే అప్పటి నుంచి ఆడీ పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లనే ఉత్పత్తి చేస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ సిఈవో మార్కస్ డ్యూస్‌మన్‌ను ఉటంకిస్తూ జర్మన్ మీడియా సోమవారం వెల్లడించింది.
సుద్దూయిష్ జైటంగ్, ఆటోమొబిల్వోచే ప్రచురించిన ఆర్టికల్స్ ప్రకారం, ఆడి 2026 తరువాత పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లను అభివృద్ధి చేస్తుంది. అయితే, 2026 నాటికి సిద్ధం అయిన నాన్-ఎలక్ట్రిక్ మోడల్స్ 2030 ల ప్రారంభం వరకు అమ్మకాలు సాగిస్తారు. అంటే 2030 తరువాత ఆడీ నాన్ ఎలక్ట్రిక్ మోడల్స్ విక్రయాలు జరపదు. ఆడీ కంపెనీ చివరి అంతర్గత దహన ఇంజన్ మోడల్ Q8 కావచ్చునని అంచనా వేస్తున్నారు. ఇది ఎలక్ట్రిక్ వేరియంట్లలో కూడా లభిస్తుంది. జర్మన్ మీడియా సంస్థ హాండెల్స్‌బ్లాట్ చెబుతున్న దాని ప్రకారం ఈ మోడల్ 2026లో మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.
వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి, యూరోపియన్ శాసనసభ్యులు, ఇతర కీలక మార్కెట్లతో పాటు, కఠినమైన ఉద్గార పరిమితులను విధించారు. వాహన తయారీదారులను అందర్నీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీవైపు అడుగులు వేసేలా అక్కడి ప్రభుత్వాలు చర్యలు ప్రారంభించాయి. దీంతో అన్ని కంపెనీలు ఈవీల తయారీవైపు తప్పనిసరి పరిస్థితుల్లో వెళుతున్నారు. ఈ క్రమంలో ఆడి ప్రస్తుతం 2025 నాటికి 20 మోడళ్లతో గ్లోబల్ ఫుల్-ఎలక్ట్రిక్ లైనప్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఆడి యొక్క ప్రాధమిక ప్రత్యర్థులలో మెర్సిడెస్ బెంజ్ మార్చిలో తమ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని విస్తరించే బ్రాండ్ ప్రణాళికలను పేర్కొంది, కాని వారి షెడ్యూల్ గురించి ఎటువంటి వివరాలను అందించలేదు. కాగా, బిఎమ్‌డబ్ల్యూ 2030 నాటికి దాని అమ్మకాలలో సగం పూర్తిగా ఎలక్ట్రిక్ మోడళ్లుగా ఉంటాయని భావిస్తోంది.
Maruti Suzuki: పెరగనున్న మరుతీకార్ల ధరలు.. వచ్చే నెల నుంచే వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న కంపెనీ!