మీ పేరు మీదు సిమ్ కార్డ్స్ ఎవరైనా వాడేస్తున్నారా? టెన్షన్ పడకండి.! ఈజీగా బ్లాక్ చేసేయొచ్చు!

మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు.? వాటిల్లో ఏది యాక్టివ్‌గా ఉంది.? మిగతా నెంబర్లను బ్లాక్ చేశారా.? లేక ఎవరైనా వాడుతున్నారా.?...

  • Updated On - 10:53 am, Tue, 22 June 21
మీ పేరు మీదు సిమ్ కార్డ్స్ ఎవరైనా వాడేస్తున్నారా? టెన్షన్ పడకండి.! ఈజీగా బ్లాక్ చేసేయొచ్చు!
Sim Cards

మీ పేరు మీద ఎన్ని మొబైల్ నెంబర్స్ తీసుకున్నారు.? వాటిల్లో ఏది యాక్టివ్‌గా ఉంది.? మిగతా నెంబర్లను బ్లాక్ చేశారా.? లేక ఎవరైనా వాడుతున్నారా.? ఇలా ఎన్నో ప్రశ్నలకు టెలికాం విభాగం తాజాగా సమాధానం ఇస్తూ ఒక కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మీకు తెలియకుండా ఎవరైనా మీ మొబైల్ నెంబర్‌ను వాడుతుంటే.. వారిని ఈజీగా పట్టుకోవచ్చు. దీనికోసం ”ది టెలికాం ఎనలైటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్సూమర్ ప్రొటెక్షన్” అనే పోర్టల్‌ను DoT లాంచ్ చేసింది.

Also Read: Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!

ఈ కొత్త వెబ్‌సైట్ ద్వారా ప్రజలందరూ కూడా వారి పేరు మీద జారీ అయిన మొబైల్ కనెక్షన్‌ల సంఖ్యను తెలుసుకోగలరు. అందులో వాడనటువంటి మొబైల్ నెంబర్లు ఉంటే.. వాటిని బ్లాక్ చేయమని కూడా అభ్యర్థించవచ్చు. అందుకోసం ముందుగా మీరు https://www.tafcop.dgtelecom.gov.in/ ని సందర్శించి, యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు వచ్చిన వన్ టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

Also Read:  రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!

అప్పుడు మీకు మీ పేర్ల మీద జారీ చేసిన మొబైల్ కనెక్షన్స్ నెంబర్లు దర్శనమిస్తాయి. వాటిల్లో మీరు వినియోగించని నెంబర్లు ఉంటే.. డీయాక్టివ్ లేదా బ్లాక్ చేసేందుకు ఉన్న ఆప్షన్‌లను ఎంచుకోవచ్చు. టికెట్ ఐడీల ద్వారా వినియోగదారులు తమ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇతరుల పేరు మీద సిమ్ కార్డులను తీసుకుని చట్టవిరుద్దమైన ప్రయోజనాలకు ఉపయోగిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్న నేపధ్యంలో టెలికాం విభాగం ఈ పోర్టల్‌ను ఏప్రిల్‌లో తిరిగి ప్రారంభించగా.. ప్రస్తుతానికి, ఈ సౌకర్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ సేవను దశలవారీగా విస్తరించాలని టెలికాం విభాగం యోచిస్తోంది. మరోవైపు కేంద్రం 155260 నెంబర్‌తో జాతీయ హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఆన్‌లైన్ మోసాలను నిరోధించేందుకు ఇది సహాయపడుతుంది.

Also Read: 13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!