13 పరుగులకే ఆలౌట్.. నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్.. ఆరు వికెట్లతో రఫ్ఫాడించిన ఆ బౌలర్ ఎవరంటే!
క్రికెట్‌లో సంచలనాలు, అద్భుతాలు నమోదవుతుండటం సహజం. అప్పుడప్పుడూ ఓటమి అంచుల్లోకి వెళ్లిన టీం అనూహ్యంగా విజయం సాధిస్తుంది...
క్రికెట్‌లో సంచలనాలు, అద్భుతాలు నమోదవుతుండటం సహజం. అప్పుడప్పుడూ ఓటమి అంచుల్లోకి వెళ్లిన టీం అనూహ్యంగా విజయం సాధిస్తుంది. అలాగే విజయం అందుకుంటుంది అని అనుకున్న టీం.. ఘోర పరాభవాన్ని చవిచూసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు చేసిన ప్రదర్శన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆ మ్యాచ్ సరిగ్గా ఇదే రోజున 1901వ సంవత్సరంలో జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Viral Video: అందం ఆరేసినట్టుగా.. బట్టలుతికేస్తోన్న ఇల్లాలు.. వీడియో చూస్తే మీరూ ఫిదా కావాల్సిందే.!
1901 సంవత్సరంలో, జూన్ 20-21 మధ్య నాటింగ్‌హామ్, యార్క్‌షైర్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదటి బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ 204 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌కు వర్షం పలుసార్లు అంతరాయం కలిగించడంతో పిచ్ ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. దీనితో యార్క్‌షైర్ తక్కువ స్కోర్ మాత్రమే చేయగలిగింది. మూడవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన లక్కీ డెంటన్ 73 పరుగుల చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
Also Read: వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..
నలుగురు బ్యాట్స్‌మెన్ ఖాతా తెరవలేదు. 4 పరుగులకే ఆరు వికెట్లు..
ఇక నాటింగ్‌హామ్ జట్టు తమ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. అయితే అనూహ్యంగా ఆ జట్టు అత్యల్ప స్కోర్‌కు ఆలౌట్ కావడం గమనార్హం. 15.5 ఓవర్లలో కేవలం 13 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ ఆర్థర్ జోన్స్ అత్యధికంగా 4 పరుగులు చేశాడు. నాటింగ్‌హామ్ బ్యాటింగ్ కొలాప్స్‌కు కారణంగా యార్క్‌షైర్ బౌలర్ విల్ఫ్రెడ్ రోడ్స్, అతడు 7.5 ఓవర్లలో 4 పరుగులు సమర్పించి ఆరు వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ స్కోఫీల్డ్ 7 ఓవర్లలో 8 పరుగులకు నాలుగు వికెట్లు తీశాడు. ఇంత తక్కువ పరుగులకు ఆలౌట్ అయిన నాటింగ్‌హామ్ ఫాలో-ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ ఆర్థర్ జోన్స్ 47 పరుగులతో, ఓపెనర్ జేమ్స్ ఐర్మాంగర్ 55 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ట్రయిల్ బై రన్స్‌ను కూడా నాటింగ్‌హామ్ దాటకపోవడంతో.. యార్క్‌షైర్ ఈ మ్యాచ్‌ను ఇన్నింగ్స్, ఎనిమిది పరుగుల తేడాతో గెలిచింది.
Also Read: రాత్రి భోజనం చేసి తర్వాత స్నానం చేయొచ్చా.? లేదా.? ఈ విషయాలను తెలుసుకోండి లేకపోతే నష్టపోతారు.!