వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jun 19, 2021 | 2:05 PM

వన్డే క్రికెట్‌లో ఏ జట్టు అత్యధిక స్కోరు సాధించిందో మీకు తెలుసా? ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ఇంగ్లండ్ 481 పరుగులు చేసిందని మీకు తెలుసా?..

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..
Odi Cricket

వన్డే క్రికెట్‌లో ఏ జట్టు అత్యధిక స్కోరు సాధించిందో మీకు తెలుసా? ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై ఇంగ్లండ్ 481 పరుగులు చేసిందని మీకు తెలుసా? ఈ వన్-సైడెడ్ మ్యాచ్ 2018, జూన్ 19వ తేదీన(ఈరోజు) జరిగింది. తమ ప్రధాన బ్యాట్స్‌మెన్లను దూరం చేసుకున్న ఆస్ట్రేలియాను ఇంగ్లాండ్ చితక్కొట్టింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ ఒకరు 100కి పైగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అత్యంత దారుణంగా ఓడిపోవడమే కాదు.. ఇదే క్రికెట్ చరిత్రలో వరస్ట్ డిఫీట్ అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. లేట్ ఎందుకు ఆ మ్యాచ్ విషయాలపై మరోసారి లుక్కేద్దాం పదండి.!

ఈ మ్యాచ్ జూన్ 19, 2018వ సంవత్సరంలో నాటింగ్‌హామ్ వేదిక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఇది సిరీస్‌లో మూడో వన్డే. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీనితో నిర్ణీత ఓవర్లకు ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 481 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టో(139), వన్ డౌన్ బ్యాట్స్‌మెన్ అలెక్స్ హేల్స్(147) అద్భుత సెంచరీలతో విధ్వంసం సృష్టించగా.. మరో ఓపెనర్ జాసన్ రాయ్(82), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(67) ఆకాశమే హద్దుగా ప్రత్యర్ధి బౌలర్లపై చెలరేగిపోయారు. బెయిర్‌స్టో, హేల్స్ కలిసి 31 ఫోర్లు, 10 సిక్సర్లు రాబట్టారు.

ఆస్ట్రేలియాకు దారుణ పరాభవం..

భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా మొదటి నుంచి దూకుడుగా ఆడటం మొదలుపెట్టింది. అయితే ఈ ప్రయత్నంలోనే వికెట్లను సైతం వరుస ఇంటర్వెల్స్‌లో కోల్పోతూ వచ్చింది. 37 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్(51) ఒక్కడే అత్యధిక స్కోరర్. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ 37 బంతుల్లో 44 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్, కెప్టెన్ టిమ్ పైన్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. దీనితో ఇంగ్లాండ్ 242 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

Also Read:

కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా? అయితే మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే! ఎందుకంటే?

పైథాన్‌ను మింగేసిన నాగుపాము.. గగుర్పాటుకు గురి చేసే వీడియో.!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu