AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs ENGW: ‘డ్రా’ తో గట్టెక్కిన భారత్..! తొలి టెస్టుతో ఆకట్టుకున్న షెఫాలీ, స్నేహ్ రాణా, తానియా

ఎట్టకేలకు భారత మహిళలు ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచారు. ఓటమిని తప్పించుకుని, డ్రాతో గట్టెక్కారు. భారత మహిళా క్రికెటర్లు అద్భుతంగా ఆడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను డ్రా గా ముగించారు.

INDW vs ENGW: 'డ్రా' తో గట్టెక్కిన భారత్..! తొలి టెస్టుతో ఆకట్టుకున్న షెఫాలీ, స్నేహ్ రాణా, తానియా
Indian Womens
Venkata Chari
|

Updated on: Jun 20, 2021 | 9:58 AM

Share

INDW vs ENGW: ఎట్టకేలకు భారత మహిళలు ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచారు. ఓటమిని తప్పించుకుని, డ్రాతో గట్టెక్కారు. భారత మహిళా క్రికెటర్లు అద్భుతంగా ఆడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను డ్రా గా ముగించారు. ఓపెనర్ షెఫాలీవర్మ (63; 83 బంతుల్లో 11×4, 1×6) పోరాటానికి తోడు లోయర్‌ ఆర్డర్‌లో స్నేహ్‌ రాణా (154 బంతుల్లో 80 నాటౌట్‌; 13 ఫోర్లు), శిఖా పాండే (50 బంతుల్లో 18; 3 ఫోర్లు), తానియా భాటియా (88 బంతుల్లో 44 నాటౌట్‌; 6 ఫోర్లు) తోడవడంతో ఓటమి అంచున ఉన్న భారత్‌ను డ్రాతో ముగించారు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న తానియా, స్నేహ్ అజేయంగా 9వ వికెట్‌కు 104 పరుగులు జోడించి టీమ్‌ఇండియాకు పరాజయాన్ని తప్పించారు.

ఓవర్‌నైట్‌ స్కోరు 83/1తో మ్యాచ్‌ చివరిరోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించింది భారత్ జట్టు. 241 పరుగులకే 8 వికెట్లు పడిపోయాయి… కీలక బ్యాట్స్‌ ఉమెన్స్‌ పెవిలియన్ చేరారు. ఇక అంతా టీమిండియాకు పరాజయం తప్పదని అనుకున్నారు. ఆ టైంలో స్నేహ్, తానియా బ్యాటింగ్‌కు దిగారు. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ, అసమాన ఆటతో ఆకట్టుకుంటూ పరుగులు సాధించారు. రోజంతా ఆడి ఇంగ్లండ్ కు విజయాన్ని దూరం చేశారు. ఆట ముగిసే సమయానికి 121 ఓవర్లలో 8 వికెట్లకు 344 పరుగులు చేసింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు టీంల కెప్టెన్లు 12 ఓవర్లు ముందుగానే డ్రాకు ఒప్పుకున్నారు. షఫాలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది. ఇతర బ్యాట్స్‌ఉమెన్స్‌లో దీప్తి శర్మ (168 బంతుల్లో 54; 8 ఫోర్లు), పూనమ్‌ రౌత్‌ (104 బంతుల్లో 39; 5 ఫోర్లు) కూడా ఆకట్టుకున్నారు. కానీ, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (4), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (8) మాత్రం మరోసారి తీవ్ర నిరాశకు గురిచేశారు. భారత్, ఇంగ్లండ్ టీంల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఈనెల 27 నుంచి ప్రారంభంకానుంది.

షెఫాలీ వర్మ అరుదైన రికార్డు తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ హాఫ్ సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కురాలిగా షెఫాలి వర్మ రికార్డులు క్రియోట్ చేసింది. మొత్తంగా 4వ మహిళా క్రికెటర్‌గా పేరుగాంచింది. 22 ఏళ్ల షెఫాలి మొదటి ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేసింది. సెంచరీకి నాలుగు పరుగుల తేడాతో మిస్ చేసుకుంది. ఇక రెండో ఇన్సింగ్స్‌లోనూ 83 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 63 పరుగులు చేసి ఆకట్టుకుంది. షెఫాలి వర్మ కంటే ముందు శ్రీలంకకు చెందిన వెనెస్సా బోవెన్, ఇంగ్లండ్‌కు చెందిన లెల్సీ కుక్ అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో రెండు హాఫ్ సెంచరీలు నమెదుచేశారు.

సంక్షిప్త స్కోర్లు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 396/9 డిక్లేర్డ్‌; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 231 ఆలౌట్‌; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 344/8 (121 ఓవర్లలో).

మ్యాచ్‌ ఫలితం: డ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: షెఫాలీవర్మ

Also Read:

Tokyo Olympics: ప్రముఖ భారతీయ ఆర్చర్ తరుణ్‌దీప్‌ రాయ్ గురించి మీకు తెలియని 10 విషయాలు..!

వన్డే క్రికెట్‌లో ప్రపంచ రికార్డు.. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు.. ఓవరాల్‌గా 481 పరుగులు..